ఐపీఎల్ మెగా వేలం: ట్రెంట్ బోల్ట్, విల్ జాక్స్.. స్టార్ ప్లేయర్లతో ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు ఇదే

First Published | Nov 27, 2024, 12:10 PM IST

IPL Mega Auction 2025 Mumbai Indians Full Squad: ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలంలో స్టార్ ప్లేయర్లను తీసుకుని బలమైన జట్టుగా కనిపిస్తోంది.

ట్రెంట్ బౌల్ట్ ముంబై ఇండియన్స్

జెడ్దాలో జరిగిన ఐపీఎల్ మెగా వేలం 2025 లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్లను వేలంలో దక్కించుకుంది. రిటెన్షన్ లో ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడే బ్యాటర్లను నిలుపుకున్న ముంబై జట్టు వేలంలో సూపర్ బౌలర్లు, ఆల్ రౌండర్లను దక్కించుకుంది. ఈ లిస్టులో న్యూజిలాండ్ లెజెండరీ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కూడా ఉన్నాడు.  మెగా వేలంలో 12.50 కోట్ల రూపాయలకు బౌల్ట్‌ను కొనుగోలు చేసింది ముంబై జట్టు.

నమన్ ధీర్‌కు 5.25 కోట్లు

పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌కు చెందిన అద్భుతమైన హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మెన్ నమన్ ధీర్ ను కూడా ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. మెగా వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 5.25 కోట్లకు అతనిని కోనుగోలు చేసింది. 

అలాగే, సౌతాఫ్రికాకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ర్యాన్ రికెల్టన్ ను కూడా ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. టాపర్డర్ లో బ్యాటింగ్ చేయగల ప్లేయర్, ఇప్పటివరకు 100 T20 ఇన్నింగ్స్‌లలో 227 ఫోర్లు, 125 సిక్సర్లతో మంచి గుర్తింపు పొందాడు.

Latest Videos


దీపక్ చాహర్ ముంబై ఇండియన్స్

దీపక్ చాహర్ రైట్ ఆర్మ్ మీడియం పేస్ స్వింగ్ బౌలర్. దేశవాళీ క్రికెట్‌లో రాజస్థాన్ తరఫున ఆడిన అతను రాబోయే ఐపీఎల్ సీజన్ లో  ముంబై ఇండియన్స్ తరపున ఆడతాడు.  9.25 కోట్లకు చాహర్‌ను కొనుగోలు చేసింది ముంబై జట్టు.

వేలానికి ముందు ఆర్సీబీ విడుదల చేసిన విల్ జాక్స్‌ను 5.25 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై జట్టు. అాలాగే, మిచెల్ సాంట్నర్ 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా మరోసారి ముంబై ఇండియన్స్ జట్టులోకి చేరాడు. అతన్ని 30 లక్షలకు కోనుగోలు చేసింది ముంబై టీమ్. లిజాడ్ విలియమ్స్ ముంబై జట్టులోకి వచ్చాడు. 75 లక్షలకు విలియమ్స్‌ను దక్కించుకుంది.

వీరు కూడా ముంబై జట్టులో చేరారు. 

అల్లా గజన్‌ఫర్: 4.80 కోట్లు

రెక్ టోప్లే: 75 లక్షలు

అశ్విని కుమార్: 30 లక్షలు

రాజ్ అంగద్ బావా: 30 లక్షలు

బెవాన్ జాకబ్స్: 30 లక్షలు

విఎస్ పెన్మెట్సా: 30 లక్షలు

రోబిన్ మింజ్: 65 లక్షలు

కరణ్ శర్మ: 50 లక్షలు

శ్రీజిత్ కృష్ణన్: 30 లక్షలు

IPL 2025 వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు జాబితా:

1. ట్రెంట్ బౌల్ట్ - రూ. 12.5 కోట్లు

2. నమన్ ధీర్ - రూ. 5.25 కోట్లు

3. రాబిన్ మింజ్ - రూ. 65 లక్షలు

4. కరణ్ శర్మ - రూ. 50 లక్షలు

5. ర్యాన్ రికెల్టన్ - రూ. 1 కోటి

6. దీపక్ చాహర్ - రూ. 9.25 కోట్లు

7. అల్లా గజన్‌ఫర్ - రూ. 4.8 కోట్లు

8. విల్ జాక్స్ - రూ. 5.25 కోట్లు

9. అశ్వని కుమార్ - రూ. 30 లక్షలు

10. మిచెల్ సాంట్నర్ - రూ. 2 కోట్లు

11. రీస్ టాప్లీ - రూ. 75 లక్షలు

12. శ్రీజిత్ కృష్ణన్ - రూ. 30 లక్షలు

13. రాజ్ అంగద్ బావా - రూ. 30 లక్షలు

14. స‌త్య‌నారాయ‌ణ రాజు - 30 లక్ష‌లు

15. బెవోన్ జాకబ్స్ - రూ. 30 లక్షలు

16. అర్జున్ టెండూల్కర్ - రూ. 30 లక్షలు

17. లిజాద్ విలియమ్స్ - రూ. 75 లక్షలు

18. విఘ్నేష్ పుత్తూరు - రూ. 30 లక్షలు


ముంబై రిటైన్ చేసుకున్న ప్లేయ‌ర్లు :  రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా.

click me!