ఐపీఎల్ 2025 మెగా వేలం: భువనేశ్వర్ కుమార్‌ను టార్గెట్ చేసిన 3 జట్లు

First Published | Nov 11, 2024, 9:58 PM IST

IPL 2025 Auction : గ‌త సీజ‌న్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)  త‌ర‌ఫున ఆడిన భార‌త బౌల‌ర్ భువనేశ్వర్ కుమార్ రాబోయే సీజ‌న్ కోసం రిటైన్ చేసుకోలేదు. దీంతో ప‌లు టీమ్ లు ఈ స్టార్ ను ద‌క్కించుకోవ‌డానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
 

SRH Squad,SRH Full squad,Sunrisers Hyderabad, IPL 2024, Kavya Maran, Bhuvneshwar Kumar

IPL 2025 Auction: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2025) కోసం భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ), ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఐపీఎల్ 2025కి ముందు ఆట‌గాళ్ల కోసం మెగా వేలం నిర్వ‌హించ‌నున్నారు. 

ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025కి ముందు 1165 మంది భారతీయులతో సహా 1574 మంది క్రికెటర్లు మెగా వేలంలో త‌మ పేర్ల‌ను న‌మోదుచేసుకున్నారు.

Bhuvneshwar Kumar

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఇప్ప‌టికే అన్ని టీమ్ లు త‌మ రిటెన్ష‌న్ ప్లేయ‌ర్ల వివ‌రాల‌ను పంచుకుంటాయి. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ కూడా త‌మ రిటెన్ష‌న్ ప్లేయ‌ర్ల వివ‌రాలు ప్ర‌క‌టించాయి. ఈ లిస్టులో బ్యాట‌ర్స్ కు పెద్దపీఠ వేశారు.

హైద‌రాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకున్న ప్లేయ‌ర్ల లిస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాళ్లు ట్రావిస్ హెడ్, ప్యాట్ క‌మ్మిన్స్ ఉన్నారు. అలాగే, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శ‌ర్మ‌లు ఉన్నారు. హైదరాబాద్ టీమ్ త‌ర‌ఫున ఆడిన స్టార్ బౌల‌ర్ భువనేశ్వర్ కుమార్ స‌న్ రైజర్స్ వ‌దులుకుంది. దీంతో అత‌న్ని ద‌క్కించుకోవ‌డానికి ప‌లు టీమ్స్ అత‌నిపై క‌న్నేశాయి. 


సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విడుదల చేసిన తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలంలోకి వ‌చ్చాడు భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్. అతను చాలా కాలం పాటు SRH త‌ర‌ఫున ఆడాడు. విజ‌య‌వంత‌మైన బౌల‌ర్ గా అనేక మ్యాచ్ ల‌ను గెలిపించాడు. 

పేసర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ 2014లో SRHలో చేరాడు. ఈ ఫ్రాంచైజీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. అత‌ను 176 మ్యాచ్‌ల్లో 181 వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన నాల్గో ప్లేయ‌ర్ గా కొన‌సాగుతున్నాడు. 

ఐపీఎల్ టోర్నమెంట్‌లో అత్యుత్తమ పేసర్‌లలో ఒకడిగా కొన‌సాగుతున్న భువ‌నేశ్వ‌ర్ కుమార్ హైద‌రాబాద్ వేలంలోకి రావ‌డంతో అత‌ని ద‌క్కించుకోవ‌డానికి మూడు టీమ్స్ పోటీ ప‌డుతున్నాయ‌ని క్రికెట్ స‌ర్కిల్ లో టాక్ న‌డుస్తోంది. వాటిలో.. 

Image credit: PTI

1. చెన్నై సూపర్ కింగ్స్

దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్‌లను విడుదల చేసిన తరువాత CSK IPL 2025 మెగా వేలంలో భారత పేసర్ల కోసం చూస్తోంది. 

34 ఏళ్ల భువనేశ్వర్ CSK అవసరాల‌కు - అపారమైన అనుభవంతో స‌రిపోతాడు. అలాగే, చెన్నై టీమ్ ఎక్కువ‌గా ఆడే మ్యాచ్ ల వేదికైన‌  చెపాక్ లో భూవీ బౌలింగ్ బంతులు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. గత సీజన్‌లో ప్లేఆఫ్ స్పాట్‌ను కోల్పోయిన తర్వాత CSK తిరిగి త‌న‌ కీర్తిని తిరిగి పొంద‌డంలో భువ‌నేశ్వ‌ర్ కుమార్  కీల‌క పాత్ర పోషించే అవ‌కాశముంది. 

2. ముంబై ఇండియన్స్

IPL 2021 తర్వాత ట్రెంట్ బౌల్ట్ నిష్క్రమించినప్పటి నుండి, పవర్‌ప్లేలో అదనపు బాధ్యతలు తీసుకోవలసి వచ్చిన జస్ప్రీత్ బుమ్రాకు సరైన బౌలింగ్ భాగస్వాములను కనుగొనడంలో ముంబై ఇండియన్స్ చాలా కష్టపడింది. డెత్ ఓవర్లకు కూడా వారికి ఒక పేస‌ర్ అవ‌స‌రం. 

దీంతో ముంబై ఇండియ‌న్స్ ఐపీఎల్ మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుంది. జాతీయ జ‌ట్టు త‌ర‌ఫున బుమ్రాతో ఆడిన అనుభవం కూడా ఉంది. అక్కడ ఇద్దరూ త‌మ బౌలింగ్ నైపుణ్యంతో త‌మ స‌త్తా చూపించారు.

3. గుజరాత్ టైటాన్స్

ఐదు రిటెన్షన్లలో గుజరాత్ టైటాన్స్ ఒక్క ఫాస్ట్ బౌలర్‌ను కూడా ఉంచుకోలేదు. మ‌హ్మ‌ద్ షమీ, ఉమేష్ యాద‌వ్, దర్శన్ నల్కండే, కార్తీక్ త్యాగి, మోహిత్ శర్మ, జోష్ లిటిల్, స్పెన్సర్ జాన్సన్ వంటి ఫాస్ట్ బౌలర్లను కూడా ఆ టీమ్ వ‌దులుకుంది.

చీలమండ శస్త్రచికిత్స కారణంగా షమీ ఆటకు దూరమైనందున మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్ కోసం చూసే జట్లలో గుజరాత్ ఒకటి. కొత్త బాల్ పేసర్ల కోసం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నైట్ గేమ్‌లలో తరచుగా కొంత స్వింగ్ మూవ్‌మెంట్ ఉంటుంది, భువనేశ్వర్ బౌలింగ్ ప‌వ‌ర్ ను ఉప‌యోగించుకోవాల‌ని చూస్తోంది.

Latest Videos

click me!