IND vs SA: భార‌త జ‌ట్టు కొంపముంచింది వీరే

First Published | Nov 11, 2024, 1:03 AM IST

IND vs SA: భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జ‌రిగిన రెండో మ్యాచ్ లో భార‌త బ్యాట‌ర్లు రాణించ‌లేక‌పోయినా బౌల‌ర్లు మాత్రం అద్భుతం చేశారు. కానీ, చివ‌రి ఓవ‌ర్ల‌లో భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకోవ‌డంతో పాటు సౌతాఫ్రికా సూప‌ర్ బ్యాటింత్ తో  ఒక ఓవ‌ర్ ముందుగానే విజ‌యాన్ని అందుకుంది. భార‌త జ‌ట్టు ఓట‌మి కార‌ణాలు ఇలా ఉన్నాయి. 
 

IND vs SA: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ తొలి మ్యాచ్ లో అద్భుత బ్యాటింగ్ తో టీమిండియా విజ‌యాన్ని అందుకుంది. కానీ, రెండో టీ20 మ్యాచ్ బోల్తా కొట్టింది. బ్యాటింగ్ లో ఘోరంగా విఫ‌ల‌మైన భార‌త జ‌ట్టు బౌలింగ్ తో అద‌ర‌గొట్టింది. స్పిన్న‌ర్లు రాణించినా.. చివ‌ర‌లో పేస‌ర్లు భారీ ప‌రుగులు స‌మ‌ర్పించుకోవ‌డంతో  భార‌త్ ఓడిపోయింది. భార‌త జ‌ట్టు ఓట‌మికి గ‌ల కార‌ణాలు ఏమిటంటే.. 

భార‌త్ - సౌతాఫ్రికా మ‌ధ్య రెండో టీ20 మ్యాచ్ సెయింట్ జార్జ్ పార్క్, గ్కేబర్హాలో జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జ‌ట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జ‌ట్టు తొలుత బ్యాటింగ్ కు దిగింది. గత మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు డ‌బుల్ సెంచ‌రీ స్కోర్ చేసింది. దీంతో ఈ మ్యాచ్ లో కూడా టీమిండియాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

కానీ, టీమిండియా ఆ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. బౌన్సీ పిచ్‌పై భార‌త బ్యాట‌ర్లు ఎక్కువ సేపు క్రీజులో నిల‌వ‌లేక‌పోయారు. వ‌రుస‌గా వికెట్లు కోల్పోయిన భార‌త జ‌ట్టు పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేక‌పోయింది. 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల నష్టానికి 124 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.


స్వ‌ల్ప టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాకు మంచి అరంభం ల‌భించింది. కానీ, వ‌రుస‌గా వికెట్లు క‌ల్పోవ‌డంతో మ్యాచ్ మ‌లుపు తిరిగింది. భార‌త స్పిన్న‌ర్లు అద‌ర‌గొట్ట‌డంతో మ్యాచ్ పూర్తిగా భార‌త్ వైపు వ‌చ్చింది. మ‌రీ ముఖ్యంగా భార‌త మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి సౌతాఫ్రికాను వ‌ణింకించాడు.  

సౌతాఫ్రికా-భార‌త్ తొలి టీ20 మ్యాచ్ లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మూడు వికెట్లు తీసుకున్నాడు. రెండో మ్యాచ్ లో కూడా అద్భుత‌మైన బౌలింగ్ తో సౌతాఫ్రికా ఆట‌గాళ్లకు చెమ‌ట‌లు ప‌ట్టించాడు. ద‌క్షిణాఫ్రికాను ఓట‌మి అంచుకు  తీసుకెళ్లాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌న 4 ఓవర్ల బౌలింగ్ తో 5 వికెట్లు తీసుకున్నాడు. 17 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి త‌న‌ T20 ఇంటర్నేషనల్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు. 

భార‌త్ నుంచి మ్యాచ్ ఎలా చేజారింది? 

స్వ‌ల్ప ల‌క్ష్యం కావ‌డంతో సౌతాఫ్రికా ఈజీగానే గెలిచేలా క‌నిపించింది. అయితే, భార‌త్ స్పిన్న‌ర్లు సూప‌ర్ బౌలింగ్ తో మ్యాచ్ ను భార‌త్ వైపు తీసుకువ‌చ్చారు. మ్యాచ్ లో భార‌త్ పై చేయి సాధించ‌డంలో విజ‌య‌వంతం అయ్యారు.  86 ప‌రుగుల‌కు 7 వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా క‌ష్టాల్లో పడేలా చేశారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ర‌వి బిష్ణోయ్ ల‌కు తోడుగా అక్ష‌ర్ పటేల్ లు త‌మ స్పిన్ మాయాజాలంతో సౌతాఫ్రికాను దెబ్బకొట్టారు. 

అయితే, డెత్ ఓవ‌ర్ల‌లో భార‌త పేస‌ర్లు భారీగా ప‌రుగులు ఇచ్చుకోవ‌డంతో టీమిండియా ఓట‌మి నుంచి తప్పించుకోలేక‌పోయింది. ముఖ్యంగా అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అవేష్ ఖాన్ లు భారీగా ప‌రుగులు ఇవ్వ‌డం భార‌త్ కొంప ముంచింది.

అలాగే, భార‌త స్పిన్ బౌల‌ర్లు అద్భుత‌మైన బౌలింగ్ తో వ‌రుస‌గా వికెట్లు తీసుకున్నారు. వారికి తోడుగా పేస‌ర్లు రాణించ‌లేక‌పోయారు. స్పిన్నర్లు అనుకూలంగా ఉన్న సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అక్షర్ పటేల్ కు బౌలింగ్ చేసే అవకాశాలు ఇవ్వకపోవడం కూడా భారత్ ఫలితాన్ని ప్రభావితం చేసింది. అలాగే, వికెట్లు పోకుండా కాపాడుకుంటూ ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ సూప‌ర్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు.

అత‌నికి తోడుగా గెరాల్డ్ కోయెట్జీ చివ‌ర‌లో ఫోర్లు, సిక్స‌ర్ల‌తో మ్యాచ్ ను మ‌లుపుతిప్పాడు. వీరిద్ద‌రు చివ‌రి వ‌ర‌కు క్రీజులో ఉండి భార‌త్ ను ఓట‌మికి కార‌ణం అయ్యారు. ట్రిస్టన్ స్టబ్స్ 47* ప‌రుగులు, గెరాల్డ్ కోయెట్జీ 19* ప‌రుగులతో సౌతాఫ్రికాకు విజ‌యాన్ని అందించారు.

Latest Videos

click me!