భారత్ కొంప ముంచిన కోయేట్జీ, స్టబ్స్
భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా అద్భుతంగా పునరాగమనం చేసి రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. గకేబర్హాలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ తో వరుసగా వికెట్లు తీసుకున్నారు. ముఖ్యంగా మన స్నిన్నర్లు అదరగొట్టేశారు. వరుణ్ చక్రవర్తి తన 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.
అయితే, ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కోయెట్జీ సూపర్ బ్యాటింగ్ తో సౌతాఫ్రికాకు విజయాన్ని అందించారు. వీరిద్దరు చివరి వరకు క్రీజులో ఉండి వికెట్లు పడకుండా కాపాడుకుంటూ చివరలో వరుసగా బౌండరీలు బాది ఒక ఓవర్ మిగిలి ఉండగానే సౌతాఫ్రికాకు విజయాన్ని అందించారు. ట్రిస్టన్ స్టబ్స్ 47* పరుగులు, గెరాల్డ్ కోయెట్జీ 19* పరుగుల సౌతాఫ్రికా గెలుపుతో కీలకంగా మారాయి.