మ‌ళ్లీ రాయ‌ల్స్ బాట‌ప‌ట్టిన ఛాంపియ‌న్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్

First Published | Sep 5, 2024, 2:54 PM IST

IPL 2025 : రాహుల్ ద్రవిడ్‌కు 2012-2013లో రెండు సీజన్‌లకు కెప్టెన్‌గా రాజ‌స్థాన్ రాయల్స్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆ త‌ర్వాత మరో రెండేళ్ల పాటు మెంటార్‌గా కూడా వ్యవహరించాడు.
 

Rahul Dravid-Sanju Samson

IPL 2025 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజ‌న్ కోసం భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) ఇప్ప‌టినుంచే ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఐపీఎల్ ప్రాంఛైజీల‌తో స‌మావేశాలు నిర్వ‌హించింది. 

ఐపీఎల్ 2025 సీజ‌న్ కు ముందు మేగా వేలం జ‌ర‌గ‌నుంది. దీంతో అన్ని జ‌ట్ల‌లో పెద్ద మార్పుల‌ను చూడ‌వ‌చ్చు. అలాగే, కొత్త రూల్స్ ను కూడా తీసుకురావ‌డానికి బీసీసీఐ సిద్ద‌మ‌వుతున్న త‌రుణంలో ఫ్రాంఛైజీల‌తో వ‌రుస స‌మావేశాలు ఆసక్తిని రే పుతున్నాయి. 

మ‌ళ్లీ సంజూ శాంస‌న్ తో జోడీ క‌డుతున్న రాహుల్ ద్ర‌విడ్ 

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన రాహుల్‌ ద్రవిడ్‌ ఐపీఎల్‌ 2025లో రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ద్ర‌విడ్ భార‌త జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ గా ఉన్న స‌మ‌యంలో అనేక అద్భుత విజ‌యాలు సాధించింది. 

వ‌రుస‌గా ఐసీసీ టోర్న‌మెంట్ల‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఒక్క అడుగు దూరంలో వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ 2023, ఛాంపియ‌న్స్ ట్రోఫీలు మిస్స‌య్యాయి. అయితే, 2024 లో ఫైన‌ల్ నిరాశ‌ను అధిగ‌మిస్తూ ద్ర‌విడ్ ప్ర‌ధాన కోచ్ గా, రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో భార‌త జ‌ట్టు టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 విజేతగా నిలిచింది. 

Latest Videos


Rahul Dravid-Suryakumar Yadav

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కాంట్రాక్టుపై ద్ర‌విడ్ చ‌ర్చ‌లు

జూన్‌లో బార్బడోస్‌లో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో భారత్ విజయం సాధించిన త‌ర్వాత రాహుల్ ద్ర‌విడ్ భార‌త జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ గా ప‌ద‌వికాలం పూర్తి చేసుకున్నారు. మ‌రోసారి కోచ్ గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డానికి ఆస‌క్తి  చూప‌లేదు. దీంతో గౌత‌మ్ గంభీర్ హెడ్ కోచ్ అయ్యారు. 

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ముగిసిన త‌ర్వాత కెరీర్‌లో స్వల్ప విరామంలో ఉన్న రాహుల్ ద్రవిడ్.. రాజ‌స్థాన్ జ‌ట్టు చేరిక‌పై ఇప్ప‌టికే కాంట్రాక్టు సైన్ చేశార‌ని స‌మాచారం. ఈ ఏడాది చివరలో జరిగే ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లను నిలుపుకోవడం వంటి ముఖ్యమైన సమస్యలపై త్వరలో ఫ్రాంచైజీతో కలిసి పనిచేయడం ప్రారంభిస్తాడ‌ని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 

మ‌రోసారి ద్ర‌విడ్ రాయ‌ల్ ఎంట్రీ

రాజ‌స్థాన్-రాహుల్ ద్ర‌విడ్ మ‌ధ్య‌ చర్చలు తుది దశకు చేరుకున్నాయనీ, త్వరలో ప్రధాన కోచ్‌గా ఆయన అడుగుపెడతారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇదిర‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో క‌లిసి రాహుల్ ద్ర‌విడ్ ప‌నిచేశారు. 

కాగా, 2021 నుండి రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న కుమార్ సంగక్కర తన పాత్రలో కొనసాగుతాడు. బార్బడోస్ రాయల్స్ (CPL), పార్ల్ రాయల్స్ (SA20) లతో మరింతగా దృష్టి సారించే అవ‌కాశ‌ముంది.

కెప్టెన్‌గా, మెంట‌ర్ గా రాజస్థాన్ రాయల్స్‌తో ద్ర‌విడ్ సుదీర్ఘ అనుబంధం

రాహుల్ ద్రావిడ్‌ 2012, 2013లో రెండు ఐపీఎల్ సీజన్‌లకు రాజ‌స్థాన్ రాయల్స్ కు  కెప్టెన్‌గా ఉన్నారు. ఆ ఐపీఎల్ కు వీడ్కోలు చెప్పిన త‌ర్వాత రాజ‌స్థాన్ జ‌ట్టుతో మెంట‌ర్ గా మ‌రో రెండేళ్లు కొన‌సాగారు. గ‌తంలో ద్రావిడ్‌, రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్ లు క‌లిసి ప‌నిచేశారు. 

ఐపీఎల్‌లో కేరళ వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంస‌న్ కు పెద్ద బ్రేక్ రావడంలో ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు.  ద్ర‌విడ్ సూచ‌న‌లు, స‌ల‌హాల‌తో సంజూతో పాటు జ‌ట్టు కూడా మంచి ఇన్నింగ్స్ ల‌ను ఆడింది. 

Rahul Dravid

ద్రవిడ్ 2016లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇదే తరహాలో వెళ్లి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) అధిపతిగా బాధ్యతలు చేపట్టే వరకు జట్టులో కొనసాగాడు. 2018లో రాయల్స్‌కు తిరిగి రాకముందు 2016 నుండి 17 వరకు సంజూ కూడా ఢిల్లీలో ఉన్నాడు.

2021లో రవిశాస్త్రి నుండి రాహుల్ ద్ర‌విడ్ భారత క్రికెట్ జ‌ట్టు ప్రధాన కోచ్  చేర‌డానికి ముందు అత‌ను ఎన్సీలో ఉన్నారు. ఇదిలా ఉండగా, ద్రవిడ్ హయాంలో భారత బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న విక్రమ్ రాథోర్‌ను ఫ్రాంచైజీ తన అసిస్టెంట్ కోచ్‌గా తీసుకోవచ్చని కూడా ESPNCricinfo నివేదించింది. 

click me!