రాజస్థాన్ బ్యాటింగ్ సాగిందిలా :
189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ టీం కు ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇచ్చారు. యశస్వి జైస్వార్ కేవలం 37 బంతుల్లో 51 పరుగులు (3 ఫోర్లు, 4 సిక్సర్లు), సంజు శాంసన్ 19 బంతుల్లో 31 పరుగులు (2 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టారు. ఓపెనర్లిద్దరు అద్బుతంగా ఆడుతున్న సమయంలో శాంసన్ గాయంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.
ఇక చివర్లో నితీష్ రానా, ద్రువ్ జురేల్ మెరుపులు మెరిపించారు. నితీష్ కేవలం 28 బంతుల్లో 51 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్సర్లు), జురేల్ 17 బంతుల్లో 26 పరుగులు (2 సిక్సర్లు) చేసారు. చివర్లో హెట్మెయర్ 9 బంతుల్లో 15 పరుగులు చేసాడు.
అయితే చివరి ఓవర్లో కేవలం 9 పరుగులు చేయాల్సి ఉండగా డిల్లీ బౌలర్ మ్యాజిక్ చేసాడు. యార్కర్ బంతులతో విరుచుకుపడి రాజస్థాన్ హిట్టర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో రాజస్థాన్ కూడా 188 పరుగులు మాత్రమే చేయగలిగింది.., ఇలా మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. ఈ సూపర్ ఓవర్లోనూ స్టార్ మాయ కొనసాగింది.