Pakistan Super League 2025
Pakistan Super League 2025 : భారతదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరిగానే పాకిస్థాన్ లో కూడా ప్రొఫెషనల్ టీ20 క్రికెట్ లీగ్ జరుగుతుంది. దానిపేరే పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL). అయితే ప్రపంచ క్రికెట్ లో రిచ్చెస్ట్ బోర్డ్ అయిన బిసిసిఐ ఈ ఐపిఎల్ ను నిర్వహిస్తోంది... కాబట్టి ఈ లీగ్ అదేస్థాయి హంగులు, ఆర్భాటాలతో సాగుతోంది. క్రికెట్ పరంగానే కాదు కమర్షియల్ గానూ ఐపిఎల్ సక్సెస్ అయ్యింది.
ఐపిఎల్ మెగా టోర్నీ ద్వారా బిసిసిఐ, జట్ల యాజమాన్యాలు లాభాల్లో ఉన్నాయి... ఆటగాళ్లు కోట్లాది రూపాయలు అందుకుంటున్నారు. క్రికెట్ పరంగానే ఐపిఎల్ ద్వారా యువ క్రికెటర్లకు మంచి అవకాశాలు వస్తున్నాయి... ఇలా వారి టాలెంట్ బైటపడుతోంది. ఇదే సమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) నిర్వహించే పిఎస్ఎల్ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. 2015 లో ప్రారంభమైన ఈ లీగ్ క్రికెట్ పరంగానూ, కమర్షియల్ గానూ సక్సెస్ కాలేదు.
పాకిస్థాన్ క్రికెట్ లీగ్ లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు ఆసక్తి చూపడంలేదు. ప్రపంచ క్రికెట్ లోని కీలక ఆటగాళ్లంతా ఐపిఎల్ లో ఆడుతున్నారు... కేవలం పాక్ క్రికెటర్లు మాత్రమే పిఎస్ఎల్ కు దిక్కయ్యారు. ఐపిఎల్ లో అవకాశం రాని కొందరు విదేశీ ఆటగాళ్లు మాత్రమే పిఎస్ఎల్ లీగ్ లో ఆడుతున్నారు. ఇలా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయిన పిఎస్ఎల్ పరిస్థితి ఎలాఉందో తెలియజేసే ఘటన ఒకటి వెలుగుచూసింది.
Pakistan Super League 2025
పిఎస్ఎల్ లో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ కు ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడే ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు. ఇలా ఆ ఆటగాడికి లక్ష రూపాయల వరకు నగదు అందిస్తారు. కానీ పాకిస్థాన్ క్రికెట్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ఆటగాడికి ఏం ఇచ్చారో తెలుసా? హెయిర్ డ్రయ్యర్... అవును మీరు విన్నది నిజమే. నిజంగానే ఇంటర్నేషనల్ క్రికెటర్ కు గల్లీ క్రికెట్ లో మాదిరిగా హెయిర్ డ్రయ్యర్ బహుమతిగా ఇచ్చి వారి పరువు వారే తీసుకున్నారు.
ఇటీవల పిఎస్ఎల్ 2025 లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మహ్మద్ రిజ్వాన్ సెంచరీతో అదరగొట్టడంతో ముల్తాన్ సుల్తాన్ 234 పరుగులు చేసింది. అయితే భారీ స్కోర్ ను చేజ్ చేసి కరాచీ కింగ్స్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ విన్స్ అద్భుతంగా ఆడాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ లభించింది.
ఈ క్రమంలోనే విన్స్ ను అభినందించేందుకు కరాచీ కింగ్స్ డ్రెస్సింగ్ రూంలో ఆయనకు ఓ బహుమతిని అందించింది. అదేంటో తెలుసా? హెయిర్ డ్రయ్యర్. అంతటితో ఆగకుండా ఇలా హెయిర్ డ్రయ్యర్ అందిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కరాచీ టీం యాజమాన్యం. దీంతో పిఎస్ఎల్ పరిస్థితిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Pakistan Super League 2025
పిఎస్ఎల్ పై నెటిజన్స్ ట్రోల్ :
ఓవైపు భారత్ లో ఐపిఎల్ నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు... ఒక్కో ఆటగాడు కోట్లలో సంపాదించుకుంటున్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ జరుగుతున్న పిఎస్ఎల్ పరిస్థితి దారుణంగా ఉంది... అక్కడ అంతర్జాతీయ క్రికెటర్లకు హెయిర్ డ్రయ్యర్ వంటి గిప్టులు ఇవ్వడంతో ట్రోలింగ్ జరుగుతోంది.
'ఈసారి హెయిర్ డ్రయ్యర్ ఇచ్చారు... తర్వాత రోటీ మేకర్ ఇస్తారా?' ఇస్తారా అంటూ ఒకరు... 'కాదు కాదు లంచ్ బాక్స్ ఇస్తారేమో' అంటూ మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. ''ఈ హెయిర్ డ్రయ్యర్ పాకిస్థాన్ లో చాలా ఖరీదైనది కావచ్చు. వారి స్తోమత అంతేగా'' అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇలా ప్రపంచ దేశాల ముందు పిఎస్ఎల్ నవ్వులపాలు అవుతోంది.