డిల్లీ బ్యాటింగ్ సాగిందిలా :
సొంత మైదానంలో ఆడుతున్న డిల్లీకి మంచి ఆరంభం లభించింది. యువ ఓపెనర్ అభిషేక్ పొరేల్ రెండో ఓవర్లో విధ్వంసం చేసాడు... 4,4,6,4,4,1 తో ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు పడటంతో రాజస్థాన్ బ్యాటింగ్ కాస్త స్లో అయ్యింది. అభిషేక్ కేవలం 37 బంతుల్లో 49 పరుగులు చేసాడు.
గత మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన కరణ్ నాయర్ డకౌట్ అయ్యాడు... అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. మెక్ గర్క్ కూడా కేవలం 9 పరుగులే చేసాడు. ఇక రాహుల్ 32 బంతుల్లో 38 పరుగులతో సందర్భోచితంగా ఆడాడు. చివర్లో స్టబ్స్ 18 బంతుల్లో 34 పరుగులు రాణించాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు... కేవలం 18 బంతుల్లోనే 34 పరుగులతో చెలరేగాడు.
మొత్తంగా డిల్లీ బ్యాటింగ్ ఆరంభం, ఫినిషింగ్ అదిరింది. మొదట్లో ఓపెనర్ పొరేల్.. చివర్లో అక్షర్, స్టబ్స్ పరుగులు రాబట్టారు. మధ్యలో స్కోరు కాస్త స్లో అయ్యింది. అయినా డిల్లీ సొంత మైదానంలో మంచి స్కోరు సాధించింది. మరి రాజస్థాన్ ఈ లక్ష్యాన్ని చేధిస్తుందో లేదో చూడాలి.