CSK vs SRH: చెన్నై సూపర్ కింగ్స్ అవుట్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

Published : Apr 26, 2025, 12:13 AM IST

IPL 2025 CSK vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో వరుస ఓటముల తర్వాత స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌ళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి వ‌చ్చింది. చెన్నై వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ పై స‌న్ రైజ‌ర్స్ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.   

PREV
15
CSK vs SRH: చెన్నై సూపర్ కింగ్స్ అవుట్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

CSK vs SRH IPL 2025: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వ‌రుస ఓట‌ముల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇక‌పై ఆడాల్సిన అన్ని మ్యాచ్ ల‌ను గెల‌వాల్సిందే. అలాంటి స‌మ‌యంలోనే మ్యాచ్ ను గెలుచుకుని మ‌ళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి వ‌చ్చింది ప్యాట్ క‌మ్మిన్స్ కెప్టెన్సీలోని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. 

25

ఈ ఐపీఎల్ సీజ‌న్ లో ప్యాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని హైద‌రాబాద్ జట్టు ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు ఓడిపోయింది. దీంతో MA చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ను డూ-ఆర్-డై మ్యాచ్‌గా మార్చింది. కీల‌కమైన ఈ మ్యాచ్ లో ధోని కెప్టెన్సీలోని చెన్నై టీమ్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. అలాగే, ఈ గెలుపు చెన్నైలో హైద‌రాబాద్ టీమ్ సాధించిన తొలి విజయం. అది కూడా స‌రైన స‌మ‌యంలో రావ‌డం విశేషం. ఈ గెలుపుతో ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ రేసులో సజీవంగా ఉండ‌గా, చెన్నై టీమ్ అవుట్ అయింది. 

 

35

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ కు మ‌రోసారి మంచి ఆరంభం ల‌భించ‌లేదు. SK రషీద్ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. మొహమ్మద్ షమీ మొదటి దెబ్బ కొట్టిన త‌ర్వాత వెంటనే సామ్ కుర్రాన్ కూడా అదే బాట పట్టాడు. 17 ఏళ్ల ఆయుష్ మాత్రే 19 బంతుల్లో 30 పరుగులకు ఔటయ్యాడు.

అయితే, డెవాల్డ్ బ్రెవిస్ అద్భుత‌మైన ఆట‌తో త‌న అరంగేట్రాన్ని ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా మార్చాడు.  21 ఏళ్ల యంగ్ ప్లేయ‌ర్ CSK తరఫున అరంగేట్రం చేసి 25 బంతుల్లో 42 పరుగుల సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. అత‌ని ఇన్నింగ్స్ తో చెన్నై టీమ్ 154 ప‌రుగులు చేసింది. 

హర్షల్ పటేల్ అద్భుత‌మైన బౌలింగ్ తో 4 వికెట్లు పడగొట్టగా, పాట్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కట్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. 

45

ఈజీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన హైద‌రాబాద్ టీమ్ కు చెన్నై సూప‌ర్ కింగ్స్ గ‌ట్ట‌గానే పోటీనిచ్చింది. అభిషేక్ శర్మ రెండో బంతికే అవుట్ అయ్యాడు. అయితే, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో హైద‌రాబాద్ టీమ్ పుంచుకుంది. 

ఫ‌స్ట్ మ్యాచ్ మిన‌హా ఇప్పటివరకు పేలవమైన ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన  ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో  34 బంతుల్లో 44 పరుగుల ఇన్నింగ్స్ లో హైద‌రాబాద్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. కమిందు మెండిస్ (32 పరుగులు), నితీష్ కుమార్ రెడ్డి (19 పరుగులు) లు మంచి ఇన్నింగ్స్ ల‌తో మ్యాచ్ ను గెలిపించారు.  మ‌రో 8 బంతులు మిగిలి ఉండగానే 155 పరుగులు చేసి SRH గెలిచింది. 

55

ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది మూడో విజయం. ఈ గెలుపుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ 9, చెన్నై సూపర్ కింగ్స్ 10వ స్థానంలోకి పడిపోయాయి. మొదటి రెండు స్థానాల్లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. సన్ రైజర్స్  హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ లను గెలవాలి. మంచి రన్ రేటు కూడా ఉండాలి. అయితే, టాప్ 4 లో ఉన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల సూపర్ ఫామ్ చూస్తే అంత ఈజీ కాదని చెప్పొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories