IPL 2025 RCB vs RR: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా గెలుపు ముంగిట బోల్తా పడుతోంది. ఆరంభం నుంచి అద్భుతంగా బ్యాటింగ్ చేసి విజయానికి సింగిల్ డిజిట్ పరుగులు అవసరమైన సమయంలో బోల్తా పడుతున్నారు. చివరి ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్.. మరో మ్యాచ్ ను కూడా కోల్పోయింది. ఇప్పుడు ఆర్సీబీలో చేతిలో ఆర్ఆర్ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఐపీఎల్ 2025 41వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగింది ఆర్సీబీ. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీలు మంచి ఆరంభం అందించారు.
ఫిల్ సాల్ట్ 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కలు అద్భుతమైన బ్యాటింగ్ తో హాఫ్ సెచరీ కొట్టాడు. తన ఇన్నింగ్స్ లో అతను 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. విరాట్ కోహ్లీ 70 పరుగుల ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. టిమ్ డేవిడ్ 23, జితేష్ శర్మ 20 పరుగులు చేయడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
206 పరుగుల భారీ టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలు మంచి ఆరంభం అందించారు. 16 పరుగులు చేసి వైభవ్ అవుట్ అయ్యాడు. మరో ఎండ్ లో ఉన్న జైస్వాల్ సునామీ రేపాడు. సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. కేవలం 19 బంతుల్లోనే 49 పరుగులు తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. నితీస్ రానా 28, రియాన్ పరాగ్ 22, ధ్రువ్ జురేల్ 47 పరుగులు ఇన్నింగ్స్ ఆడారు.
ఆర్ఆర్ బ్యాటింగ్ సమయంలో 19 ఓవర్ బౌలింగ్ చేసిన జోస్ హాజిల్ వుడ్ వరుసగా రెండు వికెట్లు తీసుకుని మ్యాచ్ ను బెంగళూరు వైపు మార్చాడు. 18.3 బంతికి ధ్రువ్ జురేల్, 18.4 బంతికి జోఫ్రా ఆర్చర్ అవుట్ చేశాడు. 2 వికెట్లతో పాటు కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి జోస్ హాజిల్ వుడ్ మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఆర్సీబీ అద్భుతమైన బౌలింగ్ తో ఆర్ఆర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది.