IPL 2022 Final: కాదేదీ రాజకీయాలకు అనర్హం. క్రీడల్లో పాలిటిక్స్ కొత్తేమీ కాదు. బీసీసీఐలో గత ఏడాదిలో జరిగిన రాజకీయాలు, యావత్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేశాయి. అయితే ఇప్పుడు ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్‌కి కూడా ఈ రాజకీయాల సెగ తగిలింది...
ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలబడబోతోంది. టేబుల్ టాపర్‌గా ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్, క్వాలిఫైయర్ 1లో రాజస్థాన్ రాయల్స్‌ని ఇప్పటికే చిత్తు చేసి ఫైనల్ చేరింది..
28
ఐపీఎల్ 2022 సీజన్‌లో అండర్‌డాగ్స్‌గా న్యూ ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, టాప్ క్లాస్ ఆటతీరుతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొదటి సీజన్‌లోనే టైటిల్ గెలవాలనే కసిగా ఉంది...
38
Image credit: PTI
రెండో క్వాలిఫైయర్‌లో ఆర్‌సీబీపై ఘన విజయం అందుకున్న రాజస్థాన్ రాయల్స్, 14 సీజన్ల తర్వాత ఫైనల్ చేరింది. ఈసారి రెండో టైటిల్ నెగ్గేందుకు అన్ని అర్హతలు సొంతం చేసుకుంది...
48
గుజరాత్ టైటాన్స్‌కి బరోడాకి చెందిన క్రికెటర్ హర్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే, రాజస్థాన్ రాయల్స్‌కి కేరళ కుర్రాడు సంజూ శాంసన్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌కి ఇప్పుడు కొందరు నెటిజన్లు పొలిటికల్ టచ్ అద్దుతున్నారు.
58
గుజరాత్‌లో కొన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అలాగే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడే...
68
Image credit: PTI
నరేంద్ర మోదీ రాష్ట్రానికి చెందిన ఫ్రాంఛైజీ ఫైనల్ చేరడంతో భారత జనతా పార్టీ మద్ధతుదారులతో పాటు మోదీ ఫ్యాన్స్, గుజరాత్ టైటాన్స్‌కి భారీగా సపోర్ట్ చేస్తున్నారు...
78
Photo source- iplt20.com
అలాగే రాజస్థాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్‌ని కాస్తా గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్‌గా కాకుండా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మ్యాచ్‌గా అభివర్ణిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు...
88
కాంగ్రెస్ పార్టీని చిత్తు చేసి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టే రాజస్థాన్ రాయల్స్‌ని ఓడించి, గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధిస్తుందని ఇప్పటికే మోదీ వీరాభిమానులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండడం విశేషం..