ఎన్నో టీమ్స్‌కి ఆడాను కానీ, ఇలా ఎక్కడా చూడలేదు... దినేశ్ కార్తీక్ స్పెషల్ మెసేజ్...

Published : May 28, 2022, 05:14 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో క్వాలిఫైయర్ దాకా దూసుకొచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు. గత రెండు సీజన్లలో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎలిమినేట్ అయిన ఆర్‌సీబీ, ఈసారి కాస్త మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి ప్రధాన కారణం దినేశ్ కార్తీక్...

PREV
19
ఎన్నో టీమ్స్‌కి ఆడాను కానీ, ఇలా ఎక్కడా చూడలేదు... దినేశ్ కార్తీక్ స్పెషల్ మెసేజ్...

ఐపీఎల్ 2022 మెగా వేలంలో దినేశ్ కార్తీక్‌ని రూ.5 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రూ.11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, రూ.15 కోట్లు తీసుకుంటున్న విరాట్ కోహ్లీ చేయలేని పనిని చేసి చూపించాడు దినేశ్ కార్తీక్...

29

ఐపీఎల్ 2022 సీజన్‌లో 16 మ్యాచుల్లో 55 సగటుతో 183.33 స్ట్రైయిక్ రేటుతో 330 పరుగులు చేశాడు దినేశ్ కార్తీక్. చాలా మ్యాచుల్లో ఆర్‌సీబీకి ఫినిషర్ రోల్ పోషించి, మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ కూడా ఇచ్చాడు దినేశ్ కార్తీక్...

39
Image credit: PTI

ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ రజత్ పటిదార్ సెంచరీతో పాటు దినేశ్ కార్తీక్ మెరుపుల కారణంగానే భారీ స్కోరు చేసి, దాన్ని కాపాడుకుంటూ రెండో క్వాలిఫైయర్‌కి వచ్చింది ఆర్‌సీబీ...

49

ఐపీఎల్ 2022 సీజన్‌ని మూడో స్థానంతో ముగించిన ఆర్‌సీబీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు దినేశ్ కార్తీక్... ‘నేను ఐపీఎల్‌లో చాలా టీమ్స్‌కి ఆడాను అయితే బెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్రాంఛైజీ మాత్రం ఇదే...

59

ఎందుకంటే నాకు ఇక్కడ దొరికినంత సపోర్ట్ ఎక్కడా దొరకలేదు. నేను క్రీజులోకి వస్తుంటే ప్రేక్షకులు ఈలలు, కేకలతో స్వాగతించిన విధానం ఎన్నటికీ మరిచిపోలేను. వారిలోని ఆ జోష్ కారణంగానే నేను మరింత ఉత్సాహంగా పరుగులు చేశాడు...

69

ఈ వయసులో నన్ను ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఇంతగా ఆదరించడం వల్లే నేను సాధించాలనుకున్నదాన్ని సాధించగలిగా.. థ్యాంక్యూ సో మచ్...

79

చాలా మంది ముఖాల్లో నవ్వులు పూయించగలిగాను. ఆటలో ఉండే మజా ఇదే. ఈ ఫ్రాంఛైజీకి ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా... సోషల్ మీడియాలో నా పైన చూపించిన ప్రేమను ఎన్నటికీ మరిచిపోలేను..

89

అభిమానులు రాసే ప్రతీ ట్వీట్, ప్రతీ పోస్ట్ నేను ఎంతో శ్రద్ధగా చదువుతాను. నాకు కావాల్సిన పాజిటివ్ ఎనర్జీని వాళ్లే అందించారు... వచ్చే ఏడాది మరింత కష్టపడతాను...’ అంటూ చెప్పుకొచ్చాడు దినేశ్ కార్తీక్...

99
Dinesh Karthik

ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డేవిల్స్‌లో ఐపీఎల్ కెరీర్ మొదలెట్టిన దినేశ్ కార్తీక్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వంటి జట్లకి ఆడాడు.. 

click me!

Recommended Stories