బెత్ మూనీ రికార్డు సెంచరీ.. చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా

Published : Sep 20, 2025, 06:58 PM IST

India Women vs Australia Women : బెత్ మూనీ 138 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. భారతపై 412 పరుగులు చేసి అరుదైన రికార్డు సాధించింది.

PREV
15
భారత్‌ బౌలింగ్ ను దంచికొట్టిన ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. శనివారం ( సెప్టెంబర్ 20న) ఢిల్లీలోని అరుణ్ జేట్లీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్‌పై 412 పరుగులు సాధించారు. ఇది మహిళల వన్డేల్లో భారత జట్టుపై ఇప్పటి వరకు నమోదైన అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అలిసా హీలీ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆస్ట్రేలియా దూకుడుగా ఆడింది.

25
బెత్ మూనీ రికార్డు సెంచరీ ఇన్నింగ్స్

నంబర్-4 బ్యాటర్ బెత్ మూనీ కేవలం 75 బంతుల్లోనే 138 పరుగులు రికార్డు ఇన్నింగ్స్ ఆడింది. ఆమె ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. 57 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి మహిళల వన్డే చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీలతో ఒకటిగా నిలిచింది. ఎల్లీస్ పెర్రీతో 106 పరుగులు, ఆపై అష్లే గార్డ్నర్‌తో 82 పరుగుల భాగస్వామ్యం అందించారు.

35
భారత్ ను కంగారు పెట్టిన ఆసీస్ టాపార్డర్

ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ భారత్ బౌలర్లను ఇబ్బందులు పెట్టింది. ఓపెనర్ జార్జియా వాల్ 81 పరుగులు చేసి బలమైన ఆరంభాన్ని ఇచ్చింది. అలీసా హీలీ 30 పరుగులకే ఔటైనా, వాల్ అద్భుతంగా నిలబడి జట్టు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. మిడిల్ ఆర్డర్‌లో ఎల్లీస్ పెర్రీ 68, అష్లే గార్డ్నర్ 39 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఐదుగురు బ్యాటర్లు కలసి 356 పరుగులు సాధించారు.

45
వికెట్లు తీసినా భారీ పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లు

భారత బౌలర్లు వికెట్లు తీసినా పరుగులను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఆసీస్ పెద్ద స్కోరు అడ్డుకోలేకపోయారు. అరుంధతి రెడ్డి 86 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశారు. రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. చివరి ఓవర్లలో కొంత పుంజుకున్నా, ఆస్ట్రేలియా స్కోరు అప్పటికే కొండంతగా మారింది.

55
రికార్డుల మోత

47.5 ఓవర్లలో ఆస్ట్రేలియా 412 పరుగులకు ఆలౌటైంది. ఇది భారత్‌పై మహిళల వన్డేల్లోనే అత్యధిక స్కోరు. అంతకుముందు 2024 డిసెంబర్ 8న బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా 371/8 చేసింది. ఈసారి ఆ రికార్డు బద్దలైంది. అయితే, ఆస్ట్రేలియా మరో అరుదైన రికార్డు చేజార్చుకుంది. 28 ఏళ్ల క్రితం మహిళా క్రికెట్ లో చేసిన అత్యధిక స్కోర్ రికార్డును ఒక పరుగుతో అధిగమించలేకపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories