హ‌ర్దిక్ పాండ్యాకు దిమ్మ‌దిరిగే షాక్

Published : Feb 12, 2025, 08:13 PM IST

IND vs ENG: ఇంగ్లాండ్ స్పిన్ మాంత్రికుడు ఆదిల్ రషీద్ భారత బ్యాటర్లకు వేసిన ట్రాప్ మాములుది కాదు.. అద్భుతమైన స్పిన్ మంత్రజాలంలో విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ అవుట్ చేశాడు. ఇక హార్దిక్ పాండ్యాకు అయితే గట్టిగానే ఇచ్చేశాడు.. !

PREV
15
హ‌ర్దిక్ పాండ్యాకు దిమ్మ‌దిరిగే షాక్
హ‌ర్దిక్ పాండ్యా, ఆదిల్ ర‌షీద్, Adil Rashid, Hardik Pandya

Hardik Pandya: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భార‌త్-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మూడో వన్డే జ‌రిగింది. ఈ మ్యాచ్ లో భార‌త బౌల‌ర్లు అద్భుత‌మైన ఆట‌తో ఆద‌ర‌గొట్టారు. దీంతో భార‌త్ ఇంగ్లాండ్ ముందు 357 ప‌రుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. అయితే, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీతో పాటు ఆల్ రౌండర్ హ‌ర్దిక్ పాండ్యాకు బిగ్ షాకిచ్చాడు ఇంగ్లాండ్ స్టార్ బౌల‌ర్ ఆదిల్ ర‌షీద్. 

25
Image Credit: Getty Images

వ‌రుసగా రెండు సిక్స‌ర్లు.. మూడో బంతికి హ‌ర్దిక్ క్లీన్ బౌల్డ్

ఈ మ్యాచ్ లో హ‌ర్దిక్ పాండ్యా మంచి ట‌చ్ లో కనిపించాడు. వ‌చ్చిన వెంట‌నే బౌండ‌రీలు బాదుతూ ప‌రుగులు చేయాల‌ని చూశాడు. అదే విధంగా వ‌రుస‌గా రెండు సిక్స‌ర్లు కొట్టాడు. అంత‌లోనే అత‌నికి బిగ్ షాక్ ఇచ్చాడు ఇంగ్లాండ్ బౌల‌ర్ ఆదిల్ ర‌షీద్. 

ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌కు భార‌త ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నాల్గో వికెట్‌గా దొరికిపోయాడు. ఈ మ్యాచ్ లో త‌న ఓవ‌ర్ చివ‌రి బంతికి పాండ్యాను ఔట్ చేశాడు.

35
Adil Rashid

భారత ఇన్నింగ్స్ 41వ ఓవర్‌లో హ‌ర్దిక్ పాండ్యా ఔట్ అయ్యాడు. పాండ్యా అదిల్ ర‌షీద్ ఓవ‌ర్ లో వైడ్ లాంగ్-ఆఫ్‌లో వరుసగా రెండు సిక్సర్లుగా కొట్టాడు. అయితే, ఆ త‌ర్వాతి బంతికి ఈ సీనియ‌ర్ స్టార్ లెగ్-స్పిన్నర్ రిప్పర్‌తో పాండ్యాను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 9 బంతులు ఎదుర్కొన్న హ‌ర్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ 17 పరుగుల వ‌ద్ద ముగిసింది. పాండ్యాను అవుట్ చేసిన దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 

45

హ‌ర్దిక్ పాండ్యాకు అదిల్ మాములు ట్రాప్ వేయ‌లేదు !

ఇంగ్లాండ్ స్పిన్ మాంత్రికుడు ఆదిల్ రషీద్ హార్దిక్ పాండ్యా వేసింది మాములు ట్రాప్ కాదు. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మొదటి ఇన్నింగ్స్ 47వ ఓవర్లో అతను భారత ఆల్ రౌండర్‌ను సూప‌ర్ డెలివ‌రీతో అవుట్ చేశాడు. రెండు భయంకరమైన సిక్సర్లకు బాదిన తర్వాత, రషీద్ త‌న స్పిన్ మ్యాజిక్ ను చూపిస్తూ పాండ్యాను క్లీన్ బౌల్డ్ చేశాడు. 

హార్దిక్ పాండ్యా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ స్టైల్ గా 78 మీటర్ల సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి బంతిని కూడా భారీ సిక్స‌ర్ గా మ‌లిచాడు. త‌ర్వాత కూడా బిగ్ షాట్ ఆడ‌బోయిన పాండ్యాను ఆదిల్ ర‌షీద్ బోల్తా కొట్టించాడు. పాండ్యానే కాదు అంతకుముందు విరాట్ కోహ్లీని కూడా ఆదిల్ పెవిలియన్ కు పంపాడు.

55
Image Credit: Getty Images

భారత టాప్ ఆర్డర్ పై రషీద్ ఆధిపత్యం

ఈ మ్యాచ్ లో ఆదిల్ రషీద్ భారత టాప్ ఆర్డర్ పై ఆధిప‌త్యం చెలాయించాడు. శుభ్‌మన్ గిల్ , విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌ల కీలకమైన వికెట్లను తీసుకున్నాడు. త‌న నాల్గో వికెట్ గా హ‌ర్దిక్ పాండ్యాను పెవిలియ‌న్ కు పంపాడు.

అయితే, అప్ప‌టికే భార‌త్ చేయాల్సిన స్కోను ను దాటేసింది. 300 ప‌రుగుల మార్కును అందుకుంది. ఇక 50 ఓవ‌ర్ల‌లో భార‌త్ 10 వికెట్లు కోల్పోయి 356 ప‌రుగులు చేసింది. గిల్ 112, కోహ్లీ 52, శ్రేయాస్ అయ్య‌ర్ 78, కేఎల్ రాహుల్ 40 ప‌రుగులతో మంచి ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు. ఆ తర్వాత భారత్ బౌలింగ్ లో కూడా అదరగొట్టడంతో ఇంగ్లాండ్ కు కష్టాలు తప్పలేదు.

Read more Photos on
click me!

Recommended Stories