భార‌త్ దెబ్బ‌కు శ్రీలంక ఔట్ - టీ20 ప్ర‌పంచ క‌ప్ లో సెమీస్ కు టీమిండియా

First Published | Oct 9, 2024, 11:51 PM IST

IND W vs SL W Highlights:  టీ20 ప్ర‌పంచ క‌ప్ లో భార‌త్ మ‌రో అద్భుత విజ‌యం అందుకుంది. శ్రీలంక డూ-ఆర్-డై మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని చ‌విచూసింది. దీంతో శ్రీలంక జట్టు హ్యాట్రిక్ ఓటముల పాలైంది. ఈ గెలుపుతో భార‌త జ‌ట్టు సెమీస్ కు చేరువైంది. 
 

India Women, Cricket, T20 world cup 2024

IND W vs SL W Highlights: మహిళల టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ మ‌రో విజ‌యాన్ని అందుకుంది. ఈ విజ‌యంతో భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు ఐసీసీ మెగా టోర్నీలో సెమీస్ రేసుకు చేరువైంది. ఇక శ్రీలంక డూ-ఆర్-డై మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి  వ‌చ్చింది. ఈ మ్యాచ్ లో భార‌త్ బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొట్టింది. 

India Women, Cricket, T20 world cup 2024

టీమిండియా సూప‌ర్ విక్ట‌రీ

దుబాయ్ లోని  దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో భాగంగా గ్రూప్ ఏ 12వ మ్యాచ్ లో భార‌త్-శ్రీలంక జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో భారత మహిళలు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ కు మంచి ఆరంభం ల‌భించింది. మొత్తంగా ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు కోల్పోయి 172 ప‌రుగులు చేసింది. 

భార‌త బ్యాట‌ర్ల‌లో షఫాలీ వర్మ 43 ప‌రుగులు, స్మృతి మంధాన 50 ప‌రుగులు, హర్మన్‌ప్రీత్ కౌర్ 52 ప‌రుగుల ఇన్నింగ్స్ ల‌తో త‌మ బ్యాట్ ప‌వ‌ర్ చూపించారు. దీంతో భార‌త్ మూడు వికెట్లు కోల్పోయి 172 ప‌రుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్ 16 ప‌రుగులు, రిచా ఘోష్ 6* ప‌రుగులు చేశారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో చ‌మ‌రి ఆట‌ప‌ట్టు, అమ కాంచనలు చెరో ఒక వికెట్ తీసుకున్నారు. 


India Women, Cricket, T20 world cup 2024

సెమీస్ కు చేరువైన భార‌త్.. శ్రీలంక ఔట్

ఈ మ్యాచ్ శ్రీలంక‌కు డూ ఆర్ డై మ్యాచ్ లాంటిది. కానీ, ఇక్క‌డ కూడా ఓట‌మి నుంచి త‌ప్పించుకోలేక‌పోయింది. శ్రీలంక జట్టు హ్యాట్రిక్ ఓటముల పాలైంది. దీని కారణంగా ఆ జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానలు  అర్ధశతకాలు బాదారు. అలాగే, షెఫాలీ వర్మ కూడా తన  మంచి ఇన్నింగ్స్‌తో శ్రీలంకను దెబ్బ‌కొట్టారు. 

కాగా, ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌లో టీమిండియా తొలి మ్యాచ్ లో శుభారంభం చేయలేదు. న్యూజిలాండ్‌పై ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. కానీ పాకిస్థాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు అద్భుతమైన పునరాగమనం చేసి పాకిస్థాన్‌ను ఓడించింది. ఇప్పుడు శ్రీలంకపై టీమ్‌ఇండియా విజయం నమోదు చేసి సెమీఫైనల్‌కు మార్గం సుగ‌మం చేసుకుంది.

India Women, Cricket, T20 world cup 2024

స్మృతి మంధాన సూప‌ర్ ఇన్నింగ్స్ 

దుబాయ్‌లో శ్రీలంకతో జరిగిన 2024 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ ప్లేయ‌ర్ స్మృతి మంధాన కేవలం 38 బంతుల్లో నాలుగు బౌండరీల‌తో 50 పరుగులు చేసింది. ప్ర‌స్తుతం కొనసాగుతున్న ఎడిషన్‌లో ఇది ఆమెకు తొలి హాఫ్ సెంచ‌రీ కాగా, టీ20 ప్ర‌పంచ క‌ప్ లో నాల్గో హాఫ్ సెంచ‌రీ.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో మంధాన, షఫాలీ వర్మ (43) 98 పరుగుల ఓపెనింగ్ స్టాండ్‌తో భారత్‌కు ఘనమైన ఆరంభాన్ని అందించారు. మంధాన కేవలం 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసినా వెంటనే ఔట్ అయింది. అయినప్పటికీ, మంధాన-ష‌ఫాలీ వర్మ టీ20 ప్ర‌పంచ క‌ప్ చరిత్రలో భారతదేశం త‌ర‌ఫున‌ మూడవ అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 

Asha Sobhana

స్మృతి మంధానకు 27వ అర్ధశతకం 

స్మృతి మంధాన  144 మ్యాచ్ ల‌లో 28.72 సగటు, 122.06 స్ట్రైక్ రేట్‌తో 3,562 పరుగులు చేశారు. అలాగే, త‌న కెరీర్‌లో 27 అర్ధ సెంచరీలు చేసింది. ఈ ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ (4,481) మాత్రమే ఆమె కంటే ఎక్కువ పరుగులు చేసింది. మహిళల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో స్మృతి మంధాన 22.52 సగటుతో 518 పరుగులు చేసింది. ఇందులో నాలుగు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.  డబ్ల్యూటీ20ల్లో శ్రీలంక జట్టుపై మంధానకు ఇది మూడో అర్ధ సెంచరీ. శ్రీలంక‌తో జ‌రిగిన 21 మ్యాచ్‌లలో 23.83 సగటుతో మొత్తం 429 పరుగులు చేసింది. 

భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సూప‌ర్ షో 

మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో శ్రీలంకతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్ర‌ద‌ర్శన చేశారు. కౌర్ కేవలం 27 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 52 పరుగులు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఎడిషన్‌లో భారత్ అత్యధిక టోర్నీ (172/3) స్కోర్ నమోదు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ త‌న టీ20 కెరీర్ లో వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశారు.
 

Latest Videos

click me!