IND vs BAN: రింకూ సింగ్, నితీష్ రెడ్డి పవర్ హిట్టింగ్ ముందు మోకరిల్లిన బంగ్లాదేశ్- టీ20 సిరీస్ భారత్ సొంతం

First Published | Oct 9, 2024, 11:03 PM IST

IND Vs BAN 2nd T20 Match Highlights: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 2-0 తేడాతో కైవసం చేసుకుంది. వరుసగా భారత్ రెండో మ్యాచ్ లలో విజయం సాధించింది. ఢిల్లీలో జరిగిన రెండో మ్యాచ్ లో రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డిల అద్భుత ప్రదర్శనతో భారత్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 

Rinku Singh, Nitish Reddy, cricket, Team india

IND Vs BAN 2nd T20 Match Highlights: భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండవ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధ‌వారం జ‌రిగింది. ఈ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది. 86 ప‌రుగుల తేడాతో బంగ్లాదేశ్ టీమ్ ను ఓడించిన భార‌త్ మూడు మ్యాచ్ సిరీస్ లో 2-0 ఆధిక్యం సాధించింది. 

Washington Sundar

టీ20 సిరీస్ భార‌త్ సొంతం 

ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఎలాంటి మార్పులు లేకుండా భారత జట్టు బరిలోకి దిగింది. అదే సమయంలో బంగ్లాదేశ్ జట్టులో మార్పులు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో 221 ప‌రుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. 

222 ప‌రుగుల టార్గెట్ తో ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన బంగ్లాదేశ్ టీమ్ కు మంచి ఆరంభం ల‌భించినా ఆ త‌ర్వాత వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. భార‌త బౌల‌ర్లు స‌మిష్టిగా రాణించి బంగ్లా టీమ్ ను 135 ప‌రుగుల‌కే ప‌రిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది.


Nitish Kumar Reddy, india, cricket

రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన భార‌త్ కు ప్రారంభంలోనే బిగ్ షాక్ త‌గిలింది. త్వ‌ర‌గానే కీల‌క‌మైన సంజూ శాంస‌న్, సూర్య కుమార్ యాద‌వ్, అభిషేక్ శ‌ర్మ వికెట్ల‌ను కోల్పోయింది. 5 ఓవ‌ర్ల‌లో కీల‌క‌మైన మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన స‌మ‌యంలో నితీష్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్ లు క్రీజులోకి వ‌చ్చారు. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ల‌తో అద‌ర‌గొట్టారు. 

నితీష్ కుమార్ రెడ్డి 34 బంతుల్లో 74 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 7 సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తన రెండో మ్యాచ్ లోనే నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. నితీష్ కుమార్ కు తోడుగా, యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ తన బ్యాట్ తో దుమ్మురేపాడు. 29 బంతుల్లో 53 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు.

Harmanpreet Kaur

కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ తో బంగ్లాదేశ్ కు షాకిచ్చిన భారత్

రింకూ సింగ్, నితీస్ కుమార్ రెడ్డిలతో పాటు హార్దిక్ పాండ్యా కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 32 పరుగుల తన ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. దీంతో భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్ 3 వికెట్లు తీసుకున్నాడు. ముస్తాఫిజుర్, తంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్ లు తలా రెండేసి వికెట్లు తీసుకున్నారు. 

భారీ టార్గెట్ తో బ్యాటింగ్ మొదలు పెట్టిన బంగ్లాదేశ్ కు మంచి ఆరంభం లభించింది. కానీ, ఆ తర్వాత భారత బౌలర్ల విజృంభ‌ణ‌తో వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి బంగ్లాదేశ్‌ను కేవలం 135 పరుగులకే పరిమితం చేసి భార‌త్ కు విజ‌యాన్ని అందించారు.

Rinku Singh-Nitish Reddy

బంగ్లాదేశ్ ఆట‌గాళ్ల‌లో మహ్మదుల్లా 41 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. మిగ‌తా ప్లేయ‌ర్లు పెద్ద ఇన్నింగ్స్ ల‌ను ఆడ‌లేక‌పోయారు. 20 ఓవ‌ర్ల‌లో 135-9 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. దీంతో మూడు మ్యాచ్ ల‌ సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని భార‌త్ సాధించింది. భార‌త బౌల‌ర్ల‌లో నితీష్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి 2-2 వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ లు త‌లా ఒక వికెట్ తీసుకున్నారు. 

Latest Videos

click me!