బంగ్లాదేశ్ బౌలింగ్ ను ఊచ‌కొత కోసిన తెలుగు తేజం నితీష్ రెడ్డి

First Published | Oct 9, 2024, 10:18 PM IST

Nitish Kumar Reddy : బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో మ్యాచ్ లో  లెగ్ స్పిన్నర్ రిషద్ హొస్సేన్ బౌలింగ్ లో వరుస సిక్సర్లతో భార‌త‌ రైజింగ్ స్టార్ నితీష్ రెడ్డి తన పవర్-హిటింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. బంగ్లా బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతూ త‌న రెండో మ్యాచ్ లో అంత‌ర్జాతీయ క్రికెట్ లో తొలి హాఫ్ సెంచ‌రీని సాధించాడు. 
 

Nitish Kumar Reddy, india, cricket

IND vs BAN : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భార‌త యంగ్ ప్లేయ‌ర్లు రింకూ సింగ్, నితీష్ రెడ్డిల ధనాధ‌న్ ఇన్నింగ్స్ ల‌తో భార‌త్ 221ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. దూకుడు స్ట్రోక్‌ప్లేకు పేరుగాంచిన నితీస్ కుమార్ రెడ్డి.. భారత్ స్కోరు 25 ప‌రుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చి దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడాడు. 
 

Rinku Singh-Nitish Reddy

మ్యాచ్ లో  లెగ్ స్పిన్నర్ రిషద్ హొస్సేన్ బౌలింగ్ లో వరుస సిక్సర్లతో భార‌త‌ రైజింగ్ స్టార్ నితీష్ రెడ్డి తన పవర్-హిటింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. బంగ్లా బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతూ త‌న రెండో మ్యాచ్ లో అంత‌ర్జాతీయ క్రికెట్ లో తొలి హాఫ్ సెంచ‌రీని సాధించాడు.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండవ T20Iలో ఈ ఆల్ రౌండర్ అద్భుత బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. ఇక్కడ పిచ్ ప్రారంభంలో బౌలింగ్‌కు అనుకూలంగా కనిపించింది. కానీ, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డిలు క్రీజులోకి వ‌చ్చిన త‌ర్వాత బ్యాటింగ్ తుఫాను మొద‌లైంది. 


Mayank Yadav-Nitish Kumar Reddy

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు త్వరగా మూడు వికెట్లు కోల్పోయిన క‌ష్టాల్లోప‌డ్డ భార‌త్ ను ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన నితీష్ రెడ్డి, రింకూ సింగ్ ఆదుకున్నారు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ , సూర్యకుమార్ యాదవ్ లను అవుట్ చేయడంతో భారత బ్యాటింగ్ లైనప్ ఆరంభంలోనే దెబ్బతిన్నది. మూడు వికెట్లు పడిపోయిన ఒత్తిడి ఉన్నప్పటికీ క్రీజులోకి వ‌చ్చిన నితీష్ రెడ్డి ఆత్మవిశ్వాసంతో తన స్ట్రోక్స్ గేమ్ తో ప‌రుగుల వ‌ర్షం కురిపించాడు. 

త‌న బ్యాట్ ప‌వ‌ర్ ను చూపిస్తూ బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌ల‌పై విరుచుకుప‌డ్డాడు నితీష్ రెడ్డి. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ లో రెండో టీ20 మ్యాచ్ ఆడుతున్న నితీష్ రెడ్డికి ఇది తొలి హాఫ్ సెంచ‌రీ. 

హాఫ్ సెంచ‌రీ త‌ర్వాత త‌న బ్యాటింగ్ ప‌దును మ‌రింత పెంచాడు. అత‌ని బ్యాటింగ్ చూస్తుంటే సెంచ‌రీ చేసేలా క‌నిపించాడు. కానీ, ముస్తాఫిజుర్ రెహమాన్ చేతిలో 74 ప‌రుగుల వ‌ద్ద‌ అవుట్ అయ్యాడు. నితీష్ రెడ్డి సెంచ‌రీ కోల్పోయినప్పటికీ భార‌త్ ఒత్తిడిలో ఉన్న స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో భార‌త జ‌ట్టులో సుస్థిర స్థానం కోసం పోటీ ప‌డుతున్న వారిలో తాను ఉన్నాన‌ని సంకేతాలు పంపాడు. ఈ ప్రదర్శనతో  రాబోయే 2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో స్థానం కోసం పోటీ ప‌డే ప్లేయ‌ర్ గా కూడా అత‌ను మార‌వ‌చ్చు. 

త‌న తొలి హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ లో రింకూ సింగ్ (53)తో కలిసి నితీష్ రెడ్డి 103 పరుగులు భాగ‌స్వామ్యం నెల‌కోల్పాడు. నితీష్ రెడ్డి అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్ గ‌మ‌నిస్తే బంగ్లాదేశ్ తో అక్టోబర్ 6 ఆదివారం మొదటి మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించ‌డానికి ముందే అత‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్ త‌ర‌ఫున ఐపీఎల్ ఆడుతున్నాడు. ఐపీఎల్ 2024 లో 11 మ్యాచ్‌లలో 33.66 సగటు, 142.92 స్ట్రైక్ రేట్‌తో 303 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక్క‌డ అత‌ని ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌నే అత‌ను టీమిండియాలోకి రావ‌డానికి స‌హ‌క‌రించింది. 

ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి కేవలం 34 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఏడు సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. త‌న తొలి అంత‌ర్జాతీయ మ్యాచ్ లో 16 ప‌రుగులు చేశాడు. మొత్తంగా త‌న టీ20 కెరీర్ లో అత‌నికిది మూడో హాఫ్ సెంచ‌రీ. మూడు వికెట్ల‌తో పాటు మొత్తంగా 485 పరుగులు చేశాడు.

21 సంవత్సరాల 136 రోజుల వయస్సులో టీ20 అంత‌ర్జాతీయ క్రికెట్ లో 50-ప్లస్ స్కోర్‌ను నమోదు చేసిన భారతదేశపు నాల్గవ పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా నితీష్ కుమార్ రెడ్డి ఘ‌న‌త సాధించాడు. అంత‌కుముందు రోహిత్ శర్మ (20 ఏళ్ల‌ 143రోజులు), తిలక్ వర్మ (20 ఏళ్ల 271రోజులు), రిషబ్ పంత్ (21 ఏళ్ల 38 రోజులు) లు ఈ ఘ‌న‌త సాధించారు. అలాగే, స్పిన్న‌ర్ల‌పై నితీష్ రెడ్డి స్ట్రైక్ రేట్ 278.94గా ఉండ‌టం విశేషం.

Latest Videos

click me!