సునామీ సెంచ‌రీ.. స్మృతి మంధాన రికార్డుల మోత

First Published | Jan 15, 2025, 1:50 PM IST

india women vs ireland women: భారత మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన బుధవారం వన్డే క్రికెట్‌లో 10వ సెంచరీని నమోదు చేసింది. త‌న సునామీ ఇన్నింగ్స్ రికార్డుల మోత మోగించింది.
 

Smriti Mandhana

india women vs ireland women: భారత మహిళల జట్టు ప్రస్తుతం ఐర్లాండ్ మహిళల జట్టుతో వన్డే సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో టీమిండియా అద్భుత‌మైన ఆట‌తో అద‌ర‌గొడుతోంది. ఇప్ప‌టికే తొలి రెండు మ్యాచ్ ల‌లో అద్భుత‌మైన ఆట‌తో సిరీస్ ను కైవ‌సం చేసుకుంది భార‌త జ‌ట్టు.

ఇప్పుడు రాజ్ కోట్ వేదిక‌గా మూడో వ‌న్డేను ఆడుతోంది. నిరంజ‌న్ షా స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో మ‌రోసారి భార‌త బ్యాట‌ర్లు ఐర్లాండ్ కు దిమ్మ‌దిరిగే షాకిచ్చారు. అద్భుత‌మైన ఆట‌తో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా భారత మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ల‌తో అద‌ర‌గొడుతున్నారు.

Smriti Mandhana, Pratika Rawal

10వ సెంచ‌రీ కొట్టిన స్మృతి మంధాన

భారత మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన బుధవారం వన్డే క్రికెట్‌లో 10వ సెంచరీని నమోదు చేసింది. త‌న సునామీ ఇన్నింగ్స్ రికార్డుల మోత మోగించింది. 10 లేదా అంతకంటే ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన ప్రపంచంలో నాలుగో మహిళా క్రికెట‌ర్ గా రికార్డు సృష్టించింది.

ఐర్లాండ్ తో జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్ లో భారత మహిళల జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భార‌త్ కు అద్భుత‌మైన ఆరంభం ల‌భించింది. భార‌త ఓపెనింగ్ బ్యాట‌ర్లు ప్రతీకా రావల్, స్మృతి మంధానలు సూప‌ర్ ఇన్నింగ్స్ లు ఆడారు. స్మృతి మంధాన, ప్ర‌తీకా రావ‌ల్ సెంచ‌రీలు సాధించారు. 


Pratika Rawal

వ‌న్డేల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ కొట్టిన స్మృతి మంధాన 

ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన సునామీ ఇన్నింగ్స్ తో సెంచ‌రీ కొట్టింది. మంధాన కేవలం 70 బంతుల్లోనే ఈ సెంచరీ సాధించింది. దీంతో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత మహిళా ప్లేయర్‌గా స్మృతి మంధాన నిలిచింది.

ఈ సెంచరీ ఇన్నింగ్స్‌తో స్మృతి మంధాన మ‌రో ఘనత సాధించింది. మహిళల ODI క్రికెట్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన నాల్గవ క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. అలాగే, త‌న కెరీర్ లో వేగ‌వంత‌మైన సెంచ‌రీని సాధించింది. మంధ‌న త‌న 135 ప‌రుగులు (80 బంతుల్లో) ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 7 సిక్స‌ర్లు బాదారు.

అత్య‌ధిక సెంచ‌రీలు కొట్టిన మూడో మ‌హిళా క్రికెట్ ప్లేయ‌ర్ గా స్మృతి మంధాన

రాజ్ కోట్ లో ఐర్లాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో సెంచ‌రీ కొట్టిన త‌ర్వాత స్మృతి మంధాన.. అత్య‌ధిక సెంచ‌రీలు సాధించిన మూడో మ‌హిళా క్రికెట‌ర్ గా నిలిచాడ‌రు. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రీడాకారిణిగా మెగ్ లానింగ్ రికార్డు సృష్టించింది. ఆమె ఇప్పటివ‌ర‌కు 15 సెంచరీలు సాధించారు. సుజీ బేట్స్ 13 సెంచరీలతో రెండో స్థానంలో ఉండగా, టామీ-మంధాన 10 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు.

Smriti Mandhana

హార్దిక్ పండ్యా-జాన్వీ కపూర్ డేటింగ్‌ లో ఉన్నారా?

15 - మెగ్ లానింగ్

13 - సుజీ బేట్స్

10 - టామీ బ్యూమాంట్

10 - స్మృతి మంధాన

9 - చమరి అట‌ప‌ట్టు

9 - షార్లెట్ ఎడ్వర్డ్స్

9 - నేట్ స్కివర్-బ్రంట్

8 - కేఎల్ రోల్ట‌న్

Latest Videos

click me!