India Women defeat Pakistan : కోలంబోలో జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భారత్ మహిళల జట్టు పాకిస్తాన్‌పై 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ కు ఇది రెండో విజయం.
ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భారత్ మహిళల జట్టు పాకిస్తాన్‌పై 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంకలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఈ విజయంతో భారత్ మహిళల జట్టు టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
24
247 పరుగులకు భారత్ ఆలౌట్
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 50 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. బంతి పై తేమ, పిచ్ స్లో గా ఉండటంతో పరుగులు చేయడానికి ప్లేయర్లు ఇబ్బందిపడ్డారు. అయితే, కీలక సమయంలో మంచి ఇన్నింగ్స్‌లు రావడంతో భారత్ ఈ స్కోరు సాధించింది.
హర్లీన్ దియోల్ 46 పరుగులు చేసి జట్టుకు బలమైన ఆరంభం అందించారు. జెమిమా రోడ్రిగ్స్ 32 పరుగులతో రాణించారు. స్మృతి మంధానా 23 పరుగులు, హర్మన్‌ప్రీత్ కౌర్ 19 పరుగులు చేశారు. చివర్లో రిచా ఘోష్ 20 బంతుల్లో 35 పరుగులు చేసి వేగంగా స్కోరును పెంచారు. భారత్ ఇన్నింగ్స్ చివర్లో వికెట్లు త్వరగా కోల్పోయినా, మొత్తం 247 పరుగులు సాధించడంతో మంచి లక్ష్యాన్ని పాకిస్తాన్ ముందు ఉంచింది.
34
పాకిస్తాన్ ఛేజ్.. ఆరంభంలోనే బిగ్ షాక్
లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ మహిళల జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కట్టుదిట్టమైన భారత బౌలింగ్ ముందు పాక్ ప్లేయర్లు నిలబడలేకపోయారు. భారత బౌలర్లు ప్రారంభం నుంచే పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో పాకిస్తాన్ 159 పరుగులకే ఆలౌట్ అయింది.
క్రాంతి గౌడ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో పాకిస్తాన్ టాప్ ఆర్డర్‌ను కూల్చారు. దీప్తి శర్మ కీలకమైన వికెట్లు తీసి జట్టు ఆధిపత్యాన్ని కొనసాగించారు. దీప్తి బౌలింగ్‌లోనే పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యారు.
పాకిస్తాన్ తరఫున సిద్రా అమీన్ ఒంటరి పోరాటం చేశారు. హాఫ్ సెంచరీ (81 పరుగులు) నాక్ ఆడారు. ఆమె భారత మహిళల వన్డే చరిత్రలో మొదటి సిక్స్ కొట్టిన పాకిస్తాన్ ప్లేయర్ గా నిలిచారు. అయితే, అవసరమైన రన్ రేటు పెరిగిపోవడంతో ఒత్తిడిలో పాకిస్తాన్ ఇన్నింగ్స్ కుప్పకూలింది.
విజయంతో భారత్ మహిళల జట్టు పాకిస్తాన్‌పై వన్డేల్లో అజేయ రికార్డును కొనసాగించింది. ప్రస్తుతం భారత జట్టు ఈ టోర్నమెంట్ గ్రూప్ స్టేజ్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.