IND vs PAK : ఇండియా vs పాకిస్తాన్.. టాస్ రచ్చ.. చీట్ చేసిన పాక్ కెప్టెన్ ఫాతిమా

Published : Oct 05, 2025, 09:41 PM IST

IND vs PAK Toss Controversy: మహిళల ప్రపంచకప్ 2025 లో ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ లో షేక్ హ్యాండ్ వివాదంతో పాటు టాస్ కూడా రచ్చలేపోతోంది. పాక్ కెప్టెన్ టాస్ విషయంలో భారత్ ను చీట్ చేశారు. వీడియోలు వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
14
IND vs PAK : టాస్ వివాదం.. అందరిముందే చీట్ చేసిన ఫాతిమా సనా

కొలంబోలో జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఆరంభంలోనే వివాదాలు మొదలయ్యాయి. పరుషుల జట్టు నుంచి కొనసాగుతున్న షేక్ హ్యాండ్ వివాదం ఇక్కడ కూడా కనిపించింది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పాక్ కెప్టెన్ తో చెతులు కలపలేదు. దీంతో పాటు టాస్ కూడా తీవ్ర దుమారం రేపుతోంది. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ సమయంలో చేసిన పిలుపు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

టాస్ సందర్భంగా భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్  కాయిన్ వేయగా, ఫాతిమా సనా మైక్‌లో స్పష్టంగా “టెయిల్స్” అని పలకడం ప్రత్యక్ష ప్రసారంలో వినిపించింది. అయితే, బ్రాడ్‌కాస్టర్, మ్యాచ్ రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్ ఇద్దరూ పొరపాటున “హెడ్స్” అని ప్రకటించారు. నాణెం “హెడ్స్” పై పడడంతో, రిఫరీ పాకిస్తాన్ టాస్ గెలిచిందని ప్రకటించారు.

24
టాస్ పై రిఫరీ వివాదాస్పద నిర్ణయం

టాస్ అనంతరం ఈ ఘటన జరిగినప్పటికీ ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. హర్మన్‌ప్రీత్ కౌర్, ఫాతిమా సనా ఇద్దరూ నిర్ణయాన్ని అంగీకరించారు. పాక్ కెప్టెన్ తాను టెయిల్స్ అని చెప్పినట్టు కూడా అక్కడ చెప్పకుండా అందరిముందే చీట్ చేశారు. ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. అయితే, సోషల్ మీడియాలో అభిమానులు ఈ దృశ్యాన్ని క్లిప్‌ల రూపంలో షేర్ చేస్తూ, “సనా స్పష్టంగా టైల్స్ చెప్పింది వినిపిస్తోంది” అని పోస్టులు చేస్తున్నారు.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫాతిమా సనా తప్పిదం గ్రహించినా, ఎందుకు అక్కడ చెప్పలేదని కూడా నెటిజన్లు ప్రశ్నించారు.

34
IND vs PAK : హ్యాండ్‌షేక్ వివాదం కొనసాగుతూనే ఉంది !

ఈ మ్యాచ్ లో టాస్ వివాదం మాత్రమే కాదు, హ్యాండ్‌షేక్ వివాదం కూడా ఉంది. ఆసియా కప్ లో పురుషుల జట్ల మధ్య మొదలైన హ్యాండ్‌షేక్ వివాదం మహిళల మ్యాచ్ లో కూడా కొనసాగింది. హర్మన్‌ప్రీత్ కౌర్, ఫాతిమా సనా ఇద్దరూ టాస్ సమయంలో పరస్పరం హ్యాండ్‌షేక్ చేయలేదు. ఇద్దరూ వేదికపై వేరువేరు మార్గాల్లో నడుస్తూ తమ జట్ల వద్దకు వెళ్లిపోయారు.

44
IND vs PAK : మధ్యలో ఆగిన మ్యాచ్.. బగ్ ఫ్యుమిగేషన్

టాస్ వివాదం తర్వాత ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే మరో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బగ్ ఫ్యుమిగేషన్ కారణంగా మ్యాచ్ తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. పెద్ద సంఖ్యలో లైట్ పురుగులు స్టేడియంలో కనిపించాయి. రెండు జట్ల ప్లేయర్లను ఇబ్బంది పెట్టాయి.

భారత్ 34 ఓవర్లకు 154/4 స్కోర్ వద్ద ఉన్నప్పుడు మ్యాచ్ ను కొద్ది సమయం నిలిపివేశారు. అప్పటివరకు హర్లీన్ డియోల్ (46), జెమిమా రోడ్రిగ్స్ (28)* జట్టును నిలదొక్కుకునేలా చేశారు. ఫాతిమా సనా, రమీన్ షమీమ్, సాదియా ఇక్బాల్ బౌలింగ్‌లతో భారత్ రన్‌రేట్‌ను పెరగకుండా చేశారు. ఫ్యుమిగేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆట నిలిచిపోయింది. కాగా, ఈ మ్యాచ్ లో భారత్ 247 పరుగులకు ఆలౌట్ అయింది.

Read more Photos on
click me!

Recommended Stories