కోహ్లి అలా చేసి ఉండకూడదు.. ఇకనైనా జాగ్రత్తగా ఉంటే బెటర్ : సునీల్ గవాస్కర్ వార్నింగ్

Published : Feb 08, 2022, 12:29 PM IST

India Vs West Indies:  వెస్టిండీస్ తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా.. తొలి వన్డేలో 8 పరుగులకే నిష్క్రమించిన కోహ్లి ఆటతీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్...   

PREV
18
కోహ్లి అలా చేసి ఉండకూడదు.. ఇకనైనా జాగ్రత్తగా ఉంటే బెటర్ : సునీల్ గవాస్కర్ వార్నింగ్

ఇండియా-వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న  వన్డే సిరీస్ లో భాగంగా తొలి  మ్యాచులో భారత మాజీ సారథి విరాట్ కోహ్లి  స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 

28

పరిమిత ఓవర్ల క్రికెట్ లో రోహిత్ శర్మ పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్న ఈ మ్యాచులో  అతడు బాధ్యతాయుత ఇన్నింగ్సుతో  అర్థ సెంచరీ చేయగా..  హిట్ మ్యాన్ కెప్టెన్సీ లో ఫస్ట్ మ్యాచ్ ఆడిన కోహ్లి మాత్రం 8 పరుగులకే ఔట్ అయ్యాడు. 

38

కాగా.. తొలి వన్డేలో 8 పరుగులకే నిష్క్రమించిన కోహ్లి ఆటతీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లి అలా ఆడి ఉండాల్సింది కాదు అని చెప్పాడు. 
 

48

గవాస్కర్ మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికా పర్యటనలో ఆ జట్టు బౌలర్లు కోహ్లిని ఇలా ఔట్ చేయడానికి ప్రయత్నించారు.  టెస్టు సిరీస్ లో అలా చేయకున్నా వన్డే సిరీస్ లో మాత్రం కొన్నిసార్లు బౌన్సర్లు విసిరారు.

58

సాధారణంగా బ్యాటర్లు హుక్ షాట్ ఆడటానిని సందేహిస్తారు.  ఎందుకంటే ఆ షాట్ ఆడే సమయంలో మనం బాడీ మీద నియంత్రణ కోల్పోవాల్సి వస్తుంది. కానీ కోహ్లి మాత్రం ఆ షాట్ ఆడటానికి ఇష్టపడతాడు.. 
 

68

అయితే  తొలి వన్డేలో అతడు  ఆ షాట్  సరిగా ఆడలేదు. అతడు కొద్దిగా ఎక్కువ బౌన్స్ అయిన బంతిని  హుక్ షాడ్ ఆడాడు.  అది  అతడు ఊహించినట్టుగా  బ్యాట్ కు మధ్యలో తాకలేదు. ఎడ్జ్ కు తాకడంతో అది నేరుగా  ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది.. 

78

కావున రాబోయే రెండు వన్డేలలో కూడా కోహ్లిని  ఇలాగే ఔట్ చేసేందుకు విండీస్ ప్రణాళికలు రచిస్తుంది.  అందుకే అతడు ఇకపై ఇలాంటి షాట్ ఆడేప్పుడు జాగ్రత్తగా ఉండాలి...’ అని గవాస్కర్ హెచ్చరించాడు. 

88

అహ్మదాబాద్ లో ముగిసిన తొలి వన్డేలో విరాట్ కోహ్లి.. 4 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటయ్యాడు.  రెండు బౌండరీలతో ఉత్సాహంగా కనిపించిన  కోహ్లి.. జోసెఫ్ బౌలింగ్ లో  కీమర్ రోచ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

Read more Photos on
click me!

Recommended Stories