IND vs PAK: ఐదు నిమిషాల్లో హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు.. భారత్-పాక్ మ్యాచ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే మరి..

Published : Feb 08, 2022, 09:51 AM ISTUpdated : Feb 08, 2022, 09:57 AM IST

India Vs Pakistan:  ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పట్నుంచే  టికెట్ల విక్రయాన్ని ప్రారంభించింది ఐసీసీ. ఇక ఇండియా-పాకిస్థాన్ వంటి హైఓల్టేజీ మ్యాచుకు...   

PREV
16
IND vs PAK: ఐదు నిమిషాల్లో హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు.. భారత్-పాక్ మ్యాచ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే మరి..

సాధారణంగా ఒక క్రికెట్ మ్యాచ్ కు వారం, పది రోజుల ముందు టికెట్ల బుకింగ్ కౌంటర్ తెరుస్తారు. అప్పుడు  క్రికెట్ ఫ్యాన్స్.. బుకింగ్ కౌంటర్ల ముందు బారులు తీరుతారు. అయితే ఇప్పుడంతా ఆన్లైన్ బుకింగే కదా..

26

ఆన్లైన్ లో వచ్చిన  తర్వాత నెల, రెండు నెలల ముందే  బుకింగ్ ఆఫర్ చేస్తున్నారు. ఇరుజట్లు, ఆటగాళ్లు, ఇతర అంశాల ఆధారంగా  టికెట్ల విక్రయం జరుగుతుంది. కానీ.. పైన చెప్పుకున్నవేవీ  ఇండియా-పాకిస్థాన్  మ్యాచుకు వర్తించవు. దాని  స్థాయి వేరు.. ఆ  మ్యాచుకు ఉండే క్రేజ్ వేరు.. 
 

36

అవును మరీ.. ఎప్పుడో అక్టోబర్ లో మొదలయ్యే (ఈ కోవిడ్ కారణంగా ఆ మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అనేది కూడా డౌటే) మ్యాచ్  కోసం ఎనిమిది నెలల ముందే అంతర్జాతీయ  క్రికెట్ మండలి (ఐసీసీ)   ఆన్లైన్ లో టికెట్ల విక్రయాన్ని ప్రారంభించింది. 
 

46

టికెట్ల  అమ్మకాన్ని  ఆన్లైన్ లో  ప్రారంభించిన ఐదంటే ఐదే నిమిషాల్లో మొత్తం టికెట్లు అమ్ముడయ్యాయంటే ఈ మ్యాచుకుండే క్రేజును అర్థం  చేసుకోవచ్చు. 

56

టీ20  ప్రపంచకప్-2022 ఎడిషన్ ఆస్ట్రేలియాలో జరుగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్  16 నుంచి నవంబర్ 13 దాకా జరగాల్సి ఉంది. ఇక చిరకాల ప్రత్యర్థులైన  ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్  అక్టోబర్ 23న జరుగుతుంది.  మెల్బోర్న్  వేదికగా జరుగబోయే ఈ మ్యాచు కోసం టికెట్ల విక్రయాన్ని సోమవారం మధ్యాహ్నం ఆన్లైన్ లో ఉంచింది  ఐసీసీ. 

66

ఇలా ఉంచిన ఐదు నిమిషాల్లోనే  టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం. 90  వేల సామర్థ్యం కలిగిన మెల్బోర్న్ లో ఈ మ్యాచ్ జరుగనుంది.  కాగా.. 2007 నుంచి 2016 వరకు (టీ20 ప్రపంచకప్ టోర్నీలలో) ఇరు జట్ల మధ్య  జరిగిన అన్ని మ్యాచుల్లో భారత్ నెగ్గింది. కానీ  2021 లో మాత్రం పాక్ గెలిచింది. 
 

Read more Photos on
click me!

Recommended Stories