MS DHONI: అప్పుడు ధోని కోసం ఆ రెండు జట్లు హోరాహోరిగా పోటీ పడ్డాయి.. ఐపీఎల్ తొలి ఆక్షనీర్ రిచర్డ్ మాడ్లీ

Published : Feb 08, 2022, 10:48 AM IST

IPL2022 Auction: త్వరలో బెంగళూరు వేదికగా జరుగబోయే  ఐపీఎల్ వేలంలో ఏ ఆటగాడిక అత్యంత ధర పలుకుతాడని  ఫ్రాంచైజీలతో పాటు ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తొలి వేలంలో ధోని కోసం..   

PREV
17
MS DHONI: అప్పుడు ధోని కోసం ఆ రెండు జట్లు హోరాహోరిగా పోటీ పడ్డాయి.. ఐపీఎల్ తొలి ఆక్షనీర్ రిచర్డ్ మాడ్లీ

ఐపీఎల్-15 కు సంబంధించి వేలం  ప్రక్రియకు మరో నాలుగు రోజులే టైమ్ ఉంది. ఈ పాటికే ఆయా ఫ్రాంచైజీలన్నీ బెంగళూరుకు చేరుకుని.. వేలంలో ఏ ఆటగాడిని దక్కించుకోవాలి..?  అనేదానిమీద కసరత్తులు చేస్తున్నాయి. 

27

ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ (2008) లో వేలం  ప్రక్రియ ఎలా జరిగింది..?  అంతకంటే ఒక్క ఏడాదికి ముందే ధోని సారథ్యంలోని టీమిండియా.. తొలి ప్రపంచకప్ నెగ్గిన తరుణంలో భారత ఆటగాళ్లకు ఎంత ధర దక్కించుకుంటారు..? అనే ఆసక్తి అప్పుడు అందరిలోనూ నెలకొని ఉంది. 
 

37

ముఖ్యంగా భారత్ కు  తొలి టీ20  ప్రపంచకప్ అందించిన ధోనిని ఏ జట్టు దక్కించుకుంటుంది..? అని అతడి అభిమానులతో పాటు  భారత క్రికెట్ ఫ్యాన్స్ లోనూ తీవ్ర ఉత్కంఠ...! కాగా  ఐపీఎల్ తొలి వేలం ప్రక్రియలో పాల్గొన్న ఆక్షనీర్ (వేలం పాట పాడే వ్యక్తి)  గా వ్యవహరించిన రిచర్డ్  మాడ్లీ ఇందుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

47

చెన్నై సూపర్ కింగ్స్  మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్.. తన యూట్యూబ్ ఛానెల్ లో రిచర్డ్ తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా రిచర్డ్ మాట్లాడుతూ.. ‘2008 ఐపీఎల్ వేలంలో  ధోనిని దక్కించుకోవడానికి అన్ని ప్రాంచైజీలు పోటీ పడ్డాయి. అయితే ఈ రేసులో ముంబై ఇండియన్స్,  చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం నువ్వా..? నేనా..? అన్నట్టు పోటీలో ఉన్నాయి. 

57

అయితే ముంబైకి అప్పటికే సచిన్ వంటి దిగ్గజ ఆటగాడు ఉన్నాడు. కానీ చెన్నైకి అలా ఎవరూ లేరు.ఆ జట్టు  తమకు దీర్ఘకాల నాయకుడు కావాలని చూస్తున్నది. అందుకే  వేలంలో పోటీ ఎక్కువగానే ఉన్నా అందుకు వెనుకాడలేదు.

67

చివరికి ఈ ప్రక్రియలో  సీఎస్కేనే విజయం వరించింది. ధోనిని చెన్నై.. 1.8 మిలియన్ డాలర్స్ (సుమారు  రూ. 9.5 కోట్లు)  తో దక్కించుకుంది..’ అని అన్నాడు. గత సీజన్ వరకు కూడా ధోనికి  ఆ ఫ్రాంచైజీ  ఏడాదికి రూ. 15 కోట్లు చెల్లించేది. కాగా..  ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన  జట్టుగా చెన్నైకి పేరు దక్కిందంటే అది ధోని చలవే. 

77

ఇక రాబోయే సీజన్ కోసం ధోని  తన సాలరీ (రూ. 12 కోట్లు)ని కూడా తగ్గించుకున్నాడు. ఈ సారి ధోని..  పూర్తి సీజన్ కు కెప్టెన్ గా ఉండటం అనుమానమే. ఈ సీజన్ లో కొన్ని మ్యాచులాడి రిటైర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  ఒకవేళ సీజన్ మొత్తం ఆడితే అది చెన్నై అభిమానులతో పాటు ధోని ఫ్యాన్స్ కు కూడా పండుగే..  

Read more Photos on
click me!

Recommended Stories