Champions Trophy: భారత్ చేతిలో పాక్ ఓటమికి 5 కారణాలు ఇవే!

Published : Feb 24, 2025, 08:59 AM IST

Champions Trophy 2025: దుబాయ్‌లో పాకిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో భారత్ ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పాకిస్థాన్ ఓడిపోవడానికి చాలా కారణాలున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం!

PREV
16
Champions Trophy: భారత్ చేతిలో పాక్ ఓటమికి 5 కారణాలు ఇవే!
IND vs PAK champions trophy 2025 reasons for pakistan loss

ICC Champions Trophy 2025 IND vs PAK: దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రాండ్ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో, భారత జట్టు సెమీ-ఫైనల్స్‌ల్లోకి అడుగుపెట్టింది. ఈ ఐసీసీ టోర్నమెంట్ నుంచి ఆతిథ్య పాకిస్తాన్ ఔట్ అయింది. 

ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ ప్రారంభంలో పాకిస్తాన్ భార‌త్ పై పైచేయి సాధించిన‌ట్టు క‌నిపించింది. కానీ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి అన్ని విభాగాల్లోనూ ఒక్కొక్కటిగా లోపాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ ఓటమికి దారితీసిన 5 కారణాలను ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

26
IND vs PAK champions trophy 2025 reasons for pakistan loss

1. బాబర్ ఆజం ఓపెనింగ్ బ్యాటింగ్‌లో విఫలం

ఈ మ్యాచ్ లో  టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఆరంభం చాలా దారుణంగా ఉంది. బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్ నెమ్మదిగా ఆరంభించారు. దీని కారణంగా పవర్ ప్లేలో జట్టు స్కోరు చాలా తక్కువగా ఉంది. అలాగే, వన్డే సగటు 50 కంటే ఎక్కువ ఉన్న అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ బాబర్ 23 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటనే, ఇమామ్ కూడా రనౌట్ గా పెలియ‌న్ కు చేరాడు.

36
IND vs PAK champions trophy 2025 reasons for pakistan loss

2. మిడిల్ ఆర్డర్‌లో త‌గ్గిపోయిన ర‌న్ రేటు 

పవర్ ప్లేలోనే కాకుండా మిడిలార్డర్‌లో కూడా పాకిస్తాన్ బ్యాటింగ్ చాలా నెమ్మదిగా సాగింది. మహ్మద్ రిజ్వాన్, షకీల్ మూడోసారి 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు, కానీ దాని కోసం 144 బంతులు ఎదుర్కొన్నారు. దీని కారణంగా, ఒత్తిడి చాలా పెరిగింది. పరుగులు సాధించడానికి ప్రయత్నిస్తూ ఒకరి తర్వాత ఒకరు బ్యాట్స్‌మెన్ వ‌రుస‌గా పెవిలియన్‌కు చేరారు. 

46
IND vs PAK champions trophy 2025 reasons for pakistan loss

3. ఫాస్ట్ బౌలింగ్‌తో పాక్ కు ప్ర‌యోజ‌నం లేక‌పాయే 

పాకిస్తాన్ తన ఫాస్ట్ బౌలింగ్ పట్ల చాలా గర్వంగా ఉంటుంది. ఆ జ‌ట్టు ప్ర‌ధాన బ‌లాల్లో పేస్ బౌలింగ్ అటాక్ ఒక‌టి. కానీ పాక్ పేస్ అటాక్ కూడా భారత బ్యాట్స్‌మెన్ ముందు ప‌నిచేయ‌లేదు. ప్రారంభం నుండే శుభ్ మ‌న్ గిల్, రోహిత్ శ‌ర్మ‌లు బౌండరీలు బాదడం మొద‌లుపెట్టారు. షాహీన్ షా, నసీమ్ షా బౌలింగ్ ను సైతం ర‌ఫ్పాడించారు. షాహీన్ రోహిత్‌ను అవుట్ చేసినప్పటికీ, అప్పటికి చాలా ఆలస్యమైంది.

56
IND vs PAK champions trophy 2025 reasons for pakistan loss

4. భారత్‌తో పోలిస్తే స్పిన్ బౌలింగ్ సాధారణమే

మిడిలార్డర్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ను పాకిస్తాన్ జట్టు అవుట్ చేయలేకపోయింది. స్పిన్ బౌలింగ్‌లో నాణ్యత కనిపించలేదు. అయితే, అబ్రార్ మంచి బంతితో శుభ్‌మన్ గిల్‌ను ఖచ్చితంగా అవుట్ చేశాడు. కానీ అతని బౌలింగ్ భారత స్పిన్నర్ల మాదిరిగా ప్ర‌భావం చూపించలేదు.

66
india vs pakistan champions trophy 2025 reasons for pakistan loss

5. విరాట్ కోహ్లీని అవుట్ చేయడంలో విఫలమవడం

పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ బ్యాట్ ఎప్పుడూ పనిచేస్తుంది. మరోసారి అదే జరిగింది. ఈ సారి కింగ్ కోహ్లీ 100 పరుగుల ఇన్నింగ్స్ తో భార‌త్ ను గెలిపించాడు. ఈ మ్యాచ్ కు ముందు విరాట్ అంత ఫామ్ లో లేడు. అయినప్పటికీ, కోహ్లీని అవుట్ చేయడానికి పాకిస్తాన్ వద్ద ఎటువంటి ప్రణాళిక ఉన్నట్లు అనిపించలేదు. ఏ బౌలర్ కూడా కోహ్లీని అడ్డుకోలేక‌పోయారు. ఇదే స‌మ‌యంలో భార‌త్ ఫీల్డింగ్ లో కొన్ని త‌ప్పిదాలు చేపిన‌ప్ప‌టికీ బౌలింగ్, బ్యాటింగ్ లో అద‌ర‌గొట్ట‌డంతో పాకిస్తాన్ ఓట‌మి నుంచి త‌ప్పించుకోలేక‌పోయింది.

Read more Photos on
click me!

Recommended Stories