ఆసియా కప్ 2025: భారత్ vs పాకిస్తాన్ బిగ్ ఫైట్.. గెలిచేది ఎవరు? హెడ్ టూ హెడ్ రికార్డులు ఇవే

Published : Sep 13, 2025, 08:06 PM IST

IND vs PAK Asia Cup Head To Head Records: ఆసియా కప్‌ 2025లో భారత్ - పాకిస్తాన్ మధ్య బిగ్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. అయితే, ఆసియా కప్ లో ఇండియా - పాకిస్తాన్ హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి? దుబాయ్ లో జరిగే మ్యాచ్ లో గెలిచేది ఎవరు?

PREV
15
అందరిచూపు భారత్ - పాకిస్తాన్ రైవల్రీపై పైనే

ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ బిగ్ ఫైట్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఈ రెండు జట్లు అనేక సార్లు తలపడ్డాయి. ఉత్కంఠ మ్యాచ్ లతో క్రికెట్ లవర్స్ కు థ్రిల్ ను పంచాయి. 1984లో షార్జాలో జరిగిన తొలి ఆసియా కప్‌లో భారత్ 54 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. అదే ఈ చారిత్రక రైవల్రీకి ఆరంభంగా నిలిచింది.

25
ఆసియా కప్‌లో భారత్ vs పాకిస్తాన్ హెడ్ టూ హెడ్ రికార్డులు

ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు మొత్తం 19 సార్లు తలపడ్డాయి. వీటిలో భారత్ 10 సార్లు విజయం సాధించింది. పాకిస్తాన్ 6 విజయాలు సాధించగా, 3 మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.

• వన్డేలు: 15 మ్యాచ్‌లు - భారత్ 8 విజయాలు, పాకిస్తాన్ 5, ఫలితం లేనివి 2 మ్యాచ్ లు.

• టీ20లు: 4 మ్యాచ్‌లు - భారత్ 3 విజయాలు, పాకిస్తాన్ 1 విజయం

ఈ గణాంకాల ప్రకారం ఆసియా కప్ లో పాకిస్తాన్ పై భారత్‌కు స్వల్ప ఆధిక్యం ఉందని చెబుతున్నాయి. అయితే, ప్రస్తుతం భారత జట్టు యంగ్ ప్లేయర్లతో బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ను కలిగి ఉంది.

35
ఆసియా కప్ టీ20 మ్యాచ్‌లలో భారత్, పాక్ ప్లేయర్ల కీలక ప్రదర్శనలు

భారత్ - పాకిస్తాన్ టీ20 మ్యాచ్ లలో పలువురు ప్లేయర్లు అద్భుతమైన ఆటతో రికార్డుల మోత మోగించారు.

• అత్యధిక పరుగులు: విరాట్ కోహ్లీ - 492 పరుగులు (11 ఇన్నింగ్స్ లు), పాకిస్తాన్ తరఫున మహమ్మద్ రిజ్వాన్ - 228 పరుగులు (5 ఇన్నింగ్స్ లు)

• అత్యధిక వ్యక్తిగత స్కోరు: 2022 టీ20 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 82* పరుగులు

• అత్యధిక వికెట్లు: హార్దిక్ పాండ్యా - 13 వికెట్లు (6 ఇన్నింగ్స్)

• ఉత్తమ బౌలింగ్ ఫిగర్స్: మొహమ్మద్ ఆసిఫ్ (పాకిస్తాన్) - 4/18

• అత్యధిక సిక్సులు: విరాట్ కోహ్లీ - 11 (11 ఇన్నింగ్స్)

45
ఆసియా కప్ లో భారత్ vs పాకిస్తాన్ : గుర్తుండిపోయే మ్యాచ్‌లు ఇవి

భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ లలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలు చాలానే ఉన్నాయి?

2010, దంబుల్లా - హర్భజన్ సింగ్ సిక్సర్ తో భారత్ గెలుపు

ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు కావాల్సిన సందర్భంలో హర్భజన్ సింగ్ మొహమ్మద్ ఆమిర్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టి భారత్‌కు ఉత్కంఠభరిత విజయాన్ని అందించాడు.

2014, మిర్‌పూర్ - ఆఫ్రిదీ మ్యాజిక్

ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు కావాల్సిన సమయంలో షాహిద్ ఆఫ్రిదీ రవిచంద్రన్ అశ్విన్‌ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి పాకిస్తాన్‌కు విజయాన్ని అందించాడు.

2016, మిర్‌పూర్ - కోహ్లీ vs ఆమిర్

టీ20 ఆసియా కప్ తొలి ఎడిషన్‌లో పాకిస్తాన్ 83 పరుగులకే ఆలౌటైంది. భారత్ ఛేజ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ విరాట్ కోహ్లీ 49 పరుగులు చేసి జట్టును 5 వికెట్ల తేడాతో గెలిపించాడు.

2023, కొలంబో – భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

భారత్ 356/2 స్కోరు చేయగా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అజేయ సెంచరీలతో అదరగొట్టారు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ సూపర్ బౌలింగ్ తో 5 వికెట్లు తీసి భారత్ కు 228 పరుగుల విజయాన్ని అందించారు.

55
ఆసియా కప్ 2025 భారత్ vs పాకిస్తాన్: గెలిచేది ఎవరు?

ఆసియా కప్ చరిత్రలో భారత్ vs పాకిస్తాన్ గణాంకాలు గమనిస్తే టీమిండియాదే పైచేయిగా ఉంది. పాకిస్తాన్ కొన్ని ఉత్కంఠ భరిత విజయాలు సాధించినా, భారత్ పలు సందర్భాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రస్తుతం ఇరు జట్లను గమనిస్తే పాకిస్తాన్ కంటే భారత్ అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉంది. ఆదివారం దుబాయ్ లో జరిగే మ్యాచ్ లో కూడా భారత్ ఆధిపత్యం కొనసాగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories