Ind Vs NZ: వాళ్లిద్దరిపై పూర్తి విశ్వాసముంది.. ఇక టీమిండియాకు స్వర్ణయుగమే.. గావస్కర్ ఆసక్తికర వ్యాఖలు

Published : Nov 17, 2021, 06:11 PM IST

India Vs New Zealand: భారత క్రికెట్ దిగ్గజాలలో ఒకడైన రాహుల్ ద్రావిడ్ టీమిండియాకు హెడ్ కోచ్ గా రావడం  తనకు చాలా సంతోషకరమైన విషయమని  సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. 

PREV
17
Ind Vs NZ: వాళ్లిద్దరిపై పూర్తి విశ్వాసముంది.. ఇక టీమిండియాకు స్వర్ణయుగమే.. గావస్కర్ ఆసక్తికర వ్యాఖలు

మరికొద్దిసేపట్లో టీమిండియా కొత్త ప్రయాణాన్ని ఆరంభించనున్నది. విరాట్ కోహ్లి తప్పుకోవడంతో సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేస్తున్న కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ ల కలయిక భారత క్రికెట్ కు లాభిస్తుందని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరూ కలిసి జట్టును ముందుకు తీసుకెళ్తారని అంటున్నారు. 

27

ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు. సన్నీ మాట్లాడుతూ.. ‘రాహుల్ ద్రావిడ్  క్రికెట్ ఆడుతున్నప్పుడు అతడు క్రీజులో ఉన్నంతవరకు ఇండియా బ్యాటింగ్ కు ఢోకాలేదని భావించేవాళ్లం. ఇదే నమ్మకంతో  టీమిండియా కొత్త కోచ్ గా కూడా అతడు విజయవంతమవుతాడని నమ్ముతున్నాను. 

37

ఇక ద్రావిడ్ తో పాటు కొత్త సారథి రోహిత్ శర్మ స్వభావాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. వాళ్లిద్దరూ ప్రశాంతంగా ఉంటారు. కావున ద్రావిడ్-రోహిత్ మధ్య సమన్వయం బాగా కుదురుతుందని నేను అనుకుంటున్నాను. వాళ్లిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు..’ అని సన్నీ అన్నాడు. 
 

47

టీమిండియాతో న్యూజిలాండ్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. నేడు జైపూర్ వేదికగా తొలి టీ20 జరుగనుండగా..19 న రాంచీలో రెండో టీ20, చివరిదైన మూడో టీ20 ఈనెల 21న ఈడెన్ గార్డెన్ లో జరుగనుంది. తొలి టెస్టు నవంబర్ 25-29 మధ్య కాన్పూర్ లో.. రెండో టెస్టు డిసెంబర్ 3-7 దాకా ముంబైలో నిర్వహించనున్నారు.

57

కాగా.. రాహుల్ ద్రావిడ్ విజయవంతమైన ఆటగాడిగానే గాక కెప్టెన్ గా కూడా విజయవంతమయ్యాడని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. ఆటగాడిగా, కెప్టెన్ గా సక్సెస్ అయిన ద్రావిడ్.. హెడ్ కోచ్ గా కూడా  సక్సెస్ అవుతాడని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

67

మిస్టర్ పర్ఫెక్షనిస్టుగా పేరున్న ద్రావిడ్ అంటేనే కచ్చితమైన ప్లానింగ్, దాని అమలు గుర్తొస్తాయని మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రస్తుతం టీమిండియాకు ప్రధాన శిక్షకుడిగా మారిన ద్రావిడ్.. పెద్ద లక్ష్యాలపై దృష్టి పెట్టాడని, చిన్న చిన్న విషయాలను అతడు పెద్దగా పట్టించుకోడని తెలిపాడు.

77

వీళ్లతో పాటే మరికొందరు సీనియర్ ఆటగాళ్లు స్పందిస్తూ..  ద్రావిడ్-రోహిత్ ల ద్వయంతో భారత క్రికెట్ లో  నయా శకం ఆరంభమైందని, వారిరువురూ కలిసి ఐసీసీ ఈవెంట్లలో ఇండియాకు ట్రోఫీలు సాధిస్తారని అంటున్నారు. మరి ఈ జోడీ విజయవంతమవుతుందా..? లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. 

Read more Photos on
click me!

Recommended Stories