నన్నే కాదు, ఛతేశ్వర్ పూజారాని కూడా అలా అవమానించారు... యార్క్‌షైర్ వివాదంలో అజీమ్ రఫీక్ సంచలన వ్యాఖ్యలు...

First Published Nov 17, 2021, 4:49 PM IST

ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ క్లబ్ యార్క్‌షైర్ వివాదం మరో మలుపు తీసుకునేలా ఉంది. ఆసియా సంతతి ఆటగాళ్లపై జాతి వివక్ష చూపించడంతో పాటు జాత్యాహంకార వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలతో యార్క్‌షైర్ క్లబ్‌పై నిషేధం విధించగా, తాజాగా ఈ వివాదంలో భారత ‘మోడ్రన్ వాల్’ ఛతేశ్వర్ పూజారా కూడా వచ్చి చేరాడు...

2008 నుంచి 2018 వరకూ యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్ తరుపున ఆడిన అజీమ్ రఫీక్,  పార్లమెంటరీ కమిటీ ముందు తాను ఎదుర్కొన్న జాతి వివక్ష అనుభవం కూడా పంచుకున్నాడు. 156 మ్యాచుల్లో 208 వికెట్లు తీసిన రఫీక్, కేవలం జాతి వివక్ష కారణంగానే ఇంగ్లాండ్ జట్టు తరుపున ఆడలేకపోయానంటూ ఆరోపించాడు. 

తాను క్లబ్‌కి ఆడుతున్న సమయంలో అలెక్స్ హేల్స్, గ్యారీ బ్యాలెన్స్ వంటి ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్లు ఆసియా ఖండానికి చెందిన క్రికెటర్లను ‘కెవిన్’ అంటూ పిలిచేవారంటూ ఆరోపించాడు అజీమ్ రఫీక్...

అలెక్స్ హేల్స్‌ పెంచుకున్న ఓ నల్ల కుక్క పేరు కూడా అదే కావడంతో, తమను కుక్కలతో సమానంగా భావించి... అలాంటి జాత్యాహంకార వ్యాఖ్యలు చేసేవారంటూ ఆరోపించాడు అజీమ్ రఫీక్...

వీటితో పాటు ‘ఏనుగులను కడిగేవాళ్లు’ అంటూ, టాయిలెట్ల దగ్గర కూర్చోవాలంటూ చెప్పేవారని, పాకిస్తాన్‌ నుంచి వచ్చినవాళ్లం కావడంతో ‘పాకీ’ అంటూ అనేకసార్లు అనేవాళ్లంటూ సంచలన ఆరోపణలు చేశాడు అజీమ్ రఫీక్...

‘నేను క్లబ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఛతేశ్వర్ పూజారా ఆ క్లబ్‌లో చేరాడు. అతనితో పాటు జాక్ బ్రూక్స్ కూడా. అప్పుడు అతన్ని మిగిలిన ప్లేయర్లు ‘స్టీవ్’ అని పిలిచేవాళ్లు. స్టీవ్ అంటే వాళ్ల దృష్టిలో పనివాడు...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు అజీమ్ రఫీక్... 

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ కూడా పూజారాకి యార్క్‌షైర్‌లో ఎదురైన అనుభవాన్ని, 2020-21 సమయంలో భారత్, ఆస్ట్రేలియాలో పర్యటించిన సమయంలో బయటపెట్టేవాడు...

‘భారత క్రికెటర్ ఛతేశ్వర్ పూజారా ఇంగ్లీష్ కౌటీ క్రికెట్‌లో యార్క్‌షైర్‌కి ఆడేవాడు. అప్పుడు అతని పేరు పలకడం ఇంగ్లీష్ ఆటగాళ్లకు చాలా కష్టంగా ఉండేది...  ఛతేశ్వర్ అని పిలవడం రాక... ‘స్టీవ్’ అని పిలిచేవాళ్లు...’ అంటూ వ్యాఖ్యానించాడు షేన్ వార్న్...

అయితే షేన్ వార్న్ చెప్పిన ‘స్టీవ్’ పదం వర్ణ వివక్షకు సంబంధించనది కావడంతో ఆ సమయంలోనే అతని కామెంట్లపై దుమారం రేగింది.  యార్క్‌షైర్‌లో ఇంగ్లీష్ ప్లేయర్లు, ఆసియా, ఆఫ్రికా ప్లేయర్లను వేరు చేసేందుకు ఇలా పిలిచేవారని తేలింది...

ఆ సమయంలో ఇంగ్లీష్ కౌంటీకి చెందిన ఓ ఉద్యోగి ఈ విషయాన్ని బయట పెట్టాడు... ‘ఆసియా ఖండానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్లు, రెస్టారెంట్ వర్కర్లను అందరూ స్టీవ్ అని పిలుస్తారు... స్టీవ్ అంటే వారి ఉద్దేశంలో పనివాడు... ఇండియా నుంచి వచ్చిన ప్రొఫెషనల్ క్రికెటర్ ఛతేశ్వర్ పూజారాని కూడా అలాగే పిలిచేవాళ్లు... అయితే పూజారాను అలా పిలవడానికి అతని పేరు పలకలేకపోవడమే కారణం...’ అంటూ వివరించాడు ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ ఉద్యోగి తాజ్ భట్...

ఛతేశ్వర్ పూజారా మాత్రం యర్క్‌షైర్ క్లబ్‌కి ఆడినప్పుడు తనకి ఎలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదని, తాను కౌంటీలకు ఆడడాన్ని ఫుల్లుగా ఆస్వాదించానంటూ కామెంట్ చేయడం విశేషం...

అజీమ్ రఫీక్ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, యార్క్‌షైర్ కౌంటీ క్లబ్‌పై నిషేధం విధించింది. యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్‌‌కి కూడా ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్టు రిపోర్టులో దాఖలైంది...

తాజాగా ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్, మైకెల్ వాగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తాను కూడా విన్నానంటూ ఈసీబీ తెలిపాడు. ‘ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో మ్యాచ్ ఆడుతున్నప్పుడు యార్క్‌షైర్ తరుపున నలుగరు ఆసియా క్రికెటర్లు పాల్గొన్నారు. దీంతో వాగన్ ‘మీరు చాలా మంది ఉన్నారు. దీని గురించి ఏదైనా చేయాలి...’ అంటూ చులకనగా మాట్లాడాడు...’ అంటూ తెలియచేశాడు అదిల్ రషీద్...

అదిల్ రషీద్ కంటే ముందు పాకిస్తాన్ మాజీ సీమర్ రాణా నవీద్ వుల్ హసన్ కూడా మైకెల్ వాగన్, జాత్యాహంకార వ్యాఖ్యలు చేసేవాడంటూ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ సీనియర్ సభ్యుడైన అతను, ఆసియా ప్లేయర్లపై చేసే చులకన వ్యాఖ్యలు మనసు నొప్పించేవంటూ కామెంట్ చేశాడు రాణా నవీద్...

click me!