IND Vs NZ: వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి చక్రం తిప్పితే అట్లుంటది మరి !

Published : Mar 02, 2025, 10:56 PM IST

IND vs NZ Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చివ‌రి గ్రూప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భార‌త్ విక్ట‌రీ అందుకుంది. మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి దెబ్బ‌కు కీవీస్ జ‌ట్టు ఆలౌట్ అయింది.   

PREV
14
IND Vs NZ: వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి చక్రం తిప్పితే అట్లుంటది మరి !
India , Cricket, Team india, varun Chakravarthy

India vs New Zealand Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. వ‌రుస విజ‌యాల‌తో ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 టైటిల్ ను అందుకోవ‌డానికి రెండు అడుగుల దూరంలోకి చేరింది. రెండు వ‌రుస విజ‌యాల‌తో సెమీ-ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా ఈ ఐసీసీ టోర్నమెంట్‌లోని చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి హ్యాట్రిక్ విక్ట‌రీలు సాధించింది. 

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ తొలుత బ్యాటింగ్ కు దిగి 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. ఆ త‌ర్వాత 250 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ జ‌ట్టు 205 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. 

24
India , Cricket, Team india

న్యూజిలాండ్ పై వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి పంజా 

ఈజీగానే ఛేదించే టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఒకానోక స‌మ‌యంలో మ్యాచ్ ను త‌న గుప్పిట్లో ఉంచుకుంది. అయితే, భార‌త మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బాల్ తో ఎంట‌రైన త‌ర్వాత మ్యాచ్ పూర్తిగా భార‌త్ చేతిలోకి వ‌చ్చేసింది. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్ ను ఆడ‌టానికి న్యూజిలాండ్ ప్లేయ‌ర్లు చాలానే క‌ష్ట‌ప‌డ్దారు. కానీ, వ‌రుణ్ స్పిన్ మాయాజాలం ముందు నిల‌బ‌డ‌లేక‌పోయారు. 

వరుణ్ చక్రవర్తి దెబ్బ‌కు న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ అయింది. వరుణ్ పంజాతో న్యూజిలాండ్ ఓడిపోయింది. టార్గెట్ త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ న్యూజిలాండ్ కు ఆరంభం మంచిగా లేదు. ఇద్దరు ఓపెనర్లు 50 పరుగుల లోపు పెవిలియన్‌కు చేరారు. అయితే, కేన్ విలియమ్సన్ (81) ఒకవైపు గట్టిగా నిలదొక్కుకోవడంతో న్యూజిలాండ్ మ్యాచ్ గెలుస్తుందని అనిపించింది. కానీ, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తికి తోడుగా కుల్దీప్ యాద‌వ్, అక్ష‌ర్ ప‌టేల్, హ‌ర్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజాలు రాణించ‌డంతో న్యూజిలాండ్ ప్లేయ‌ర్లు అలా వ‌చ్చి ఇలా పెవిలియ‌న్ కు చేరారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌న అద్భుతమైన బౌలింగ్ తో 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. భార‌త్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. 

34
India , Cricket, Team india, varun Chakravarthy

న్యూజిలాండ్ గెలిచేలా అనిపించిన స‌మ‌యంలో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి అద‌ర‌గొట్టేశాడు

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 కోసం ఎంపిక చేసిన జ‌ట్టులో యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ స్థానంలో వ‌రుణ్ చక్ర‌వ‌ర్తిని జ‌ట్టులోకి తీసుకున్నారు. అయితే, భార‌త్ ఆడిన మొద‌టి రెండు మ్యాచ్ ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తికి ప్లేయింగ్ 11లో చోటుద‌క్క‌లేదు. అయితే, వ‌రుస‌గా రెండు మ్యాచ్ లు గెలిచిన త‌ర్వాత భార‌త్ సెమీస్ కు చేరుకోవ‌డంతో హ‌ర్షిత్ రాణా స్థానంలో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ప్లేయింగ్ 11లోకి వ‌చ్చాడు. 

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో వ‌రుణ్ చక్ర‌వ‌ర్తికి ఇది తొలి మ్యాచ్. త‌న మిస్ట‌రీ స్పిన్ తో మ‌రోసారి  అద్భుతం చేశారు. భారత్ కు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో వికెట్లు అందించాడు. వరుణ్ చక్రవర్తి చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు పడగొట్టి కీవీస్ ను కోలుకోలేని దెద్బ‌కొట్టాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 5 వికెట్లతో అద‌ర‌గొట్టాడు. త‌న బౌలింగ్ లో న్యూజిలాండ్ జ‌ట్టులో కీల‌క‌మైన‌ విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్ వెల్, మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ వికెట్ల‌ను తీసుకున్నాడు. వ‌రుణ్ త‌న 10 ఓవ‌ర్ల‌లో 42 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 

44
India , Cricket, Team india

భార‌త్ బ్యాటింగ్ లో శ్రేయాస్ అయ్యర్, అక్షర్ ప‌టేల్, హార్దిక్ పాండ్యా ల కీల‌క ఇన్నింగ్స్ లు 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు మంచి శుభారంభం ల‌భించ‌లేదు. టాప్-3 బ్యాట్స్‌మెన్ 30 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరారు. శుభ్‌మన్ గిల్ 15 పరుగులు, రోహిత్ శర్మ 2 పరుగులు, విరాట్ కోహ్లీ 11 పరుగులు చేశారు. దీంతో భార‌త్ క‌ష్టాల్లో ప‌డింది. ఈస మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ బాధ్యతయుత‌మైన ఇన్నింగ్స్ ల‌ను ఆడారు. నాల్గో వికెట్‌కు 98 పరుగుల పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అక్షర్ ప‌టేల్ 42 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే, హాఫ్ సెంచ‌రీ కొట్టిన త‌ర్వాత శ్రేయాస్ అయ్యర్ కూడా 79 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. దీని తర్వాత, హార్దిక్ పాండ్యా చివరి ఓవర్లలో వేగంగా బ్యాటింగ్ చేసి 45 పరుగులు జోడించాడు. దీంతో భార‌త్ 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. న్యూజిలాండ్ పై గెలుపుతో భార‌త్ సెమీస్ లో ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. 

Read more Photos on
click me!

Recommended Stories