టాస్ లో రోహిత్ శర్మ చెత్త రికార్డు
భారత జట్టుతో పాటు రోహిత్ శర్మ కూడా టాస్ విషయంలో చెత్త రికార్డు నమోదుచేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ఇంటర్నేషనల్స్‌లో (ODIs) వరుసగా 10 టాస్‌లు ఓడిపోయాడు. 2023 ప్రపంచ కప్ ఫైనల్లో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ టాస్ ఓడిపోవడం మొదలైంది. అప్పటి నుంచి రోహిత్ దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో కూడా టాస్ ఓడిపోయి.. వరుసగా 10 టాస్ ఓటములను పూర్తి చేశాడు.
అత్యధిక టాస్ లు ఓడిపోయిన కెప్టెన్లు వీరే:
భారత కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 10వ సారి టాస్ ఓడిపోవడంతో వన్డేల్లో వరుసగా అత్యధిక టాస్‌లు కోల్పోయిన కెప్టెన్ల జాబితాలో హిట్ మ్యాన్ 3వ స్థానానికి చేరాడు.
బ్రియన్ లారా- 12 మ్యాచ్ టాస్ లు, అక్టోబర్ 1998 నుండి మే 1999 వరకు
పీటర్ బోర్రెన్ - 11 మ్యాచ్ టాస్ లు, మార్చి 2011 నుండి ఆగస్టు 2013 వరకు
రోహిత్ శర్మ - 10 మ్యాచ్ టాస్ లు, నవంబర్ 2023 నుండి మార్చి 2025 వరకు
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా అక్టోబర్ 1998 - మే 1999 మధ్య వరుసగా 12 టాస్ ఓడిపోయాడు. నెదర్లాండ్స్‌కు చెందిన పీటర్ బోరెన్ మార్చి 2011 నుంచి ఆగస్టు 2013 మధ్య వరుసగా 11 టాస్ ఓడిపోయాడు.