IND vs NZ Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చివరి గ్రూప్ మ్యాచ్ లో ఇండియా vs న్యూజిలాండ్ తలపడ్డాయి. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో వరుణ్ చక్రవర్తి చక్రం తిప్పి భారత్ కు విజయాన్ని అందించాడు.
India vs New Zealand Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భాగంగా దుబాయ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య చివరి గ్రూప్ మ్యాచ్ జరిగింది. ఆదివారం (మార్చి 2) జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ అదరగొడుతూ భారత్ సూపర్ విక్టరీ అందుకుంది. శ్రేయాస్, హర్ధిక్, అక్షర్ పటేల్ మంచి ఇన్నింగ్స్ లతో తోడుగా వరుణ్ చక్రవర్తి అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో భారత్ కు విక్టరీని అందించారు.
25
గ్రూప్ ఏలో టాప్ ప్లేస్ లో టీమిండియా
ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు మంచి శుభారంభం లభించలేదు. దీంతో కివీస్ జట్టు ముందు భారత్ 250 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 249 పరుగులు చేసింది. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో టీమిండియా ప్లేయర్లు శ్రేయాస్ అయ్యర్ 79, హార్దిక్ పాండ్యా 45, అక్షర్ పటేల్ 42 పరుగులతో కీలక ఇన్నింగ్స్ లను ఆడారు. ఛేదనలో న్యూజిలాండ్ జట్టు 205 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు గ్రూప్ ఏ లో టాప్ లో నిలిచింది.
వరుసగా మూడో విజయాన్ని అందుకుని భారత జట్టు గ్రూప్ ఏ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. న్యూజిలాండ్ పై గెలుపునకు ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లను భారత్ ఓడించింది. మరోవైపు, కివీస్ జట్టు ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు విజయాలతో సెమీస్ కు చేరుకుంది. అయితే, మూడో మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయింది. ఈ విజయంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ లో ఆసీస్ తో తలపడనుంది.
45
Varun Chakaravarthy
వరుణ్ చక్రవర్తి సూపర్ బౌలింగ్
250 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ ఒంటరి పోరాటం చేస్తూ అత్యధికంగా 81 పరుగులు చేశాడు. అయితే, మ్యాచ్ ను గెలిపించలేకపోయాడు.
భారత్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి తన స్పిన్ మాయాజాలంతో న్యూజిలాండ్ ను దెబ్బకొట్టాడు. ఈ టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్ లోనే వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో అదరగొట్టాడు. వరుణ్ చక్రవర్తి తన బౌలింగ్ లో విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్ వెల్, మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ వికెట్లను తీసుకున్నాడు. వరుణ్ తన 10 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.
55
Image Credit: Getty Images
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్లో ఆసీస్ తో తలపడనున్న భారత్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ లను ఓడించింది. మరోవైపు, ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ జట్టు తొలి ఓటమిని చవిచూసింది. అంతకుముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను ఓడించింది. ఈ విజయంతో భారత్ గ్రూప్ ఏలో మొదటి స్థానంలో నిలిచింది. 3 మ్యాచ్‌లను గెలిచి 6 పాయింట్లు సాధించింది. న్యూజిలాండ్ 3 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి 4 పాయింట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ మూడో స్థానంలో, పాకిస్తాన్ చివరి స్థానంలో ఉన్నాయి.
మార్చి 4న జరిగే సెమీఫైనల్లో భారత్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆ మ్యాచ్ కూడా దుబాయ్‌లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. న్యూజిలాండ్ జట్టు ఇప్పుడు లాహోర్ లో రెండో సెమీస్ లో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది.