India vs England: ఎంఎస్ ధోని రికార్డు బ్రేక్.. గంగూలీని అధిగ‌మించిన రోహిత్ శ‌ర్మ‌..

First Published | Feb 16, 2024, 12:45 PM IST

Rohit Sharma breaks MS Dhoni's record :భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 196 బంతుల్లో 131 పరుగులు చేసిన రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా, అంత‌ర్జాతీయ క్రికెట్ లో 17వ ప్లేయ‌ర్ గా నిలిచాడు. 470 మ్యాచ్ ల‌లో 18,641 పరుగులు చేసి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (18,575)ని అధిగమించాడు.
 

Rohit Sharma records: రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాడ్ మూడో టెస్టులో కీలక దశలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మ‌రోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో క‌లిసి సెంచ‌రీ కొట్టాడు. ఎన్నో రికార్డులు సృష్టించారు.

Rohit Sharma

రోహిత్ 196 బంతుల్లో 131 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్ తో దిగ్గ‌జ ప్లేయ‌ర్లు భార‌త మాజీ కెప్టెన్లు సౌర‌వ్ గంగూలీ, ఎంఎస్ ధోనిల‌ను రోహిత్ శ‌ర్మ అధిగ‌మించాడు.


India vs England: 11 fours, 2 sixes.. Rohit Sharma hits century against England in Rajkot

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన 4వ ప్లేయ‌ర్ గా, అంత‌ర్జాతీయ క్రికెట్ లో 17వ ఆటగాడిగా రోహిత్ శ‌ర్మ నిలిచాడు. హిట్ మ్యాన్ త‌న కెరీర్ లో 470 మ్యాచ్‌ల్లో 18,641 పరుగులు చేసి, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (18,575)ని అధిగమించాడు. ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్ (24,208) టాప్ లో ఉండ‌గా, విరాట్ కోహ్లీ (26,733), రాహుల్ ద్రవిడ్ (24,208) తొలి 3 స్థానాల్లో ఉన్నారు.

Rohit Sharma

అలాగే, క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన అతి పెద్ద వయస్సు గల భారత కెప్టెన్‌గా కూడా రోహిత్ శ‌ర్మ రికార్డు సృష్టించాడు. అలాగే, అంత‌ర్జాతీయ క్రికెట్ లో ఓపెనర్‌గా 42 సెంచరీల రికార్డును క్రిస్ గేల్ రికార్డును  సమం చేశాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (49), సచిన్ టెండూల్కర్ (45) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Rohit Sharma

రోహిత్ శ‌ర్మ ఈ ఇన్నింగ్స్ లో మూడు సిక్స‌ర్లు బాదాడు. దీంతో కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్సర్ల సంఖ్యను 212కి పెంచాడు. ఇది కెప్టెన్ ల‌లో అత్యధికం. ఈ క్ర‌మంలోనే కెప్టెన్ గా అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్ట‌లిన ఎంఎస్ ధోని (211 సిక్సర్లు)ని రోహిత్ శ‌ర్మ‌ అధిగమించాడు. ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ 233 సిక్సర్లతో ప్రపంచ లీడర్‌బోర్డ్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.

Rohit Sharma

అలాగే, టెస్టులో రోహిత్ మొత్తం 79 సిక్సర్లు బాది, భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన వారి జాబితాలో ఎంఎస్ ధోని (78 సిక్సర్లు)ను అధిగమించి 2వ స్థానానికి చేరుకున్నాడు. ఈ లిస్టులో భార‌త డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ (91) అగ్రస్థానంలో ఉన్నాడు.

Latest Videos

click me!