హార్దిక్ పాండ్యాకు ఝ‌ల‌క్.. టీ20 ప్రపంచకప్‍-2024 లో భార‌త కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ !

First Published | Feb 15, 2024, 8:29 AM IST

T20 World Cup 2024 -Rohit Sharma: ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలోని భార‌త జ‌ట్టు తిరుగులేని విజ‌యాల‌తో ఫైన‌ల్ కు చేరుకుంది. హార్ధిక్ పాండ్యా వ‌రుస గాయాల నేప‌థ్యంలో రాబోయే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త్ ను ముందుకు న‌డిపే సార‌థి గురించి జైషా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. 
 

Rohit Sharma

T20 World Cup 2024 -Rohit Sharma: వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ లో భారత జట్టును ముందుకు న‌డిపే నాయ‌కుడి గురించి గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ సాగుతూనే ఉంది. ఇంత‌కుముందు హార్ధిక్ పాండ్యా భార‌త‌ టీ20 జ‌ట్టుకు సార‌థ్యం వ‌హించాడు. అయితే, వ‌రుస గాయాల‌తో అత‌ను జ‌ట్టుకు దూర‌మ‌య్యాయి. దీంతో ఆఫ్ఘ‌నిస్తాన్ తో జ‌రిగిన టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ సారథ్యం భార‌త్ జ‌ట్టు ఆడింది.

rohit sharma caption

అయితే, రాబోయే ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 కు కూడా రోహిత్ శ‌ర్మ భార‌త్ జ‌ట్టుకు కెప్టెన్ గా ఉంటారా?  లేదా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కోలుకున్నాడు. మ‌ళ్లీ అత‌నికే భార‌త టీ20 ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌నే టాక్ కూడా వినిపించింది.

Latest Videos


Rohit Sharma-Hardik Pandya

బీసీసీఐ కార్యదర్శి జై షా  వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టుకు ఎవ‌రు నాయ‌క‌త్వం వ‌హిస్తార‌నే ఊహాగ‌నాల‌కు తెర‌దించుతూ కామెంట్స్ చేశారు. రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో భార‌త జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024లో ఆడ‌నుంద‌ని ధృవీకరించారు. గత ఏడాది అక్టోబర్ లో చీలమండ గాయం నుంచి ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో  పొట్టి ఫార్మాట్ లో కూడా రోహిత్ శ‌ర్మ‌నే కెప్టెన్ గా కొనసాగించాలని బీసీసీఐ బోర్డు భావిస్తోంది. 

ఎస్సీఏ స్టేడియానికి కొత్త‌పేరుగా మాజీ బోర్డు కార్యదర్శి నిరంజన్ షా పేరు పెట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో జైషా మీడియాతో మాట్లాడుతూ రోహిత్ శ‌ర్మ గతంలో ఇతర టీ20 తో పాటు ఫార్మాట్ ల‌కు కెప్టెన్ గా వ్యవహరించాడనీ, అఫ్గానిస్థాన్ సిరీస్ కోసం తిరిగి టీ20 కెప్టెన్ గా తిరిగి వచ్చాడనీ, ఇక ముందుకూడా భార‌త జ‌ట్టును న‌డిపించ‌నున్నాడ‌ని తెలిపాడు.

Zaheer Khan,Rohit Sharma

అలాగే, అఫ్గానిస్థాన్ తో జరిగిన మూడో టీ20లో భారత్ 22/4తో నిలిచిందనీ, రోహిత్ శర్మ జట్టును 212/4కు తీసుకెళ్లిన తీరు చూస్తే అతని నాయ‌క‌త్వం గురించి పెద్దగా ప్రశ్నించలేమని జైషా అన్నాడు. "మేం ఫైనల్లో గెలవలేదు, కానీ ఇది ఆటలో భాగం. ఎవరు మెరుగ్గా ఆడితే వారు గెలుస్తారు' అని షా పేర్కొన్నారు.

Rohit Sharma

'అహ్మదాబాద్ లో 2023 (ఫైనల్)లో వరుసగా 10 విజయాలు సాధించినా ప్రపంచకప్ గెలవకపోయినా అంద‌రి హృదయాలను గెలిచాం. 2024 (టీ20 వరల్డ్ క‌ప్)లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో బార్బడోస్ (ఫైనల్కు వేదిక)గా భారత పతాకాన్ని ఎగురవేస్తామ‌ని నేను మీకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను" అని జైషా పేర్కొన్నారు.

Rohit Sharma

భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్, ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, రోహిత్, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, భారత జట్టు సహాయక సిబ్బంది ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

click me!