హెలికాప్ట‌ర్ షాట్స్ మోత.. ! ఐపీఎల్ కోసం ధోని మొదలు పెట్టాడు.. !

First Published | Feb 8, 2024, 6:56 PM IST

Ms Dhoni - IPL 2024: గ‌తేడాది ఐపీఎల్ 2023 టోర్నమెంట్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు ధోని ఐపీఎల్ కు నుంచి రిటైర్మెంట్ తీసుకుంటార‌ని భావించారు. కానీ, మరో ఏడాది పాటు ఆడతానంటూ ధోని అందరికీ సర్ఫ్రైజ్ ఇచ్చాడు.

Ms Dhoni - IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 17వ ఎడిషన్ మార్చి 23న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్ప‌టికే దినికి సంబంధించిన ఏర్పాట్ల‌ను పూర్తి చేస్తున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

రాబోయే ఐపీఎల్ కోసం క్రికెట్ ప్రియులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బ‌రిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 సీజ‌న్ లో టైటిల్ తో ఆరోసారి ట్రోఫీని గెలుచుకోవాల‌ని చూస్తోంది. 


ఐపీఎల్ 2023 టోర్నమెంట్ ఫైనల్‌లో ఎంఎస్ ధోని నాయ‌క‌త్వంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్.. గుజరాత్ టైటాన్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి రికార్డు స్థాయిలో 5వ సారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

అన్ని రకాల క్రికెట్‌లకు దూరంగా ఉంటున్న ఎంఎస్ ధోని కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. 42 ఏళ్ల ఈ వెటరన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌కి ఇదే చివరి ఐపీఎల్‌. దీనిని ఘ‌నంగా ముంగించాల‌ని ధోని భావిస్తున్నారు.

'തല' രണ്ട്

రాబోయే ఐపీఎల్ సీజ‌న్ కోసం ఎంఎస్ ధోని ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు. ధోని ప్రాక్టిస్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. 

Chennai Super Kings, MS Dhoni

గ‌తేడాది ఐపీఎల్ 2023 టోర్నమెంట్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు ధోని ఐపీఎల్ కు నుంచి రిటైర్మెంట్ తీసుకుంటార‌ని భావించారు. కానీ, మరో ఏడాది పాటు ఆడతానంటూ ధోని షాక్ ఇచ్చాడు.

ധോണി?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 16వ ఎడిషన్‌లో, ధోని మోకాలి నొప్పి ఉన్నప్పటికీ ఆడాడు. ఆ త‌ర్వాత శస్త్ర చికిత్స త‌ర్వాత పూర్తిగా కోలుకున్నాడు. ఐపీఎల్ 2023 టోర్నమెంట్ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించని  ఎంఎస్ ధోని..  తన భార్య సాక్షి ధోని, కుటుంబ స‌భ్యుల‌తో సమయం గ‌డుపుతున్నాడు.

MS Dhoni

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరైన ఎంఎస్ ధోని ప్రస్తుతం రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ఈ సారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచి ధోనికి అద్భుత‌మైన వీడ్కోల్ ఇవ్వాల‌ని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ చూస్తోంది. 

Latest Videos

click me!