ఇండియా vs ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్ లు ఫ్రీగా ఎక్కడ చూడాలి? పూర్తి షెడ్యూల్ ఇదిగో

Published : Feb 04, 2025, 08:34 PM IST

india vs england: భారత్-ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ఫిబ్ర‌వ‌రి 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్  మ్యాచ్ లు ఫ్రీగా ఎక్క‌డ చూడాలి? ఏ స‌మ‌యంలో మ్యాచ్ లు జ‌రుగుతాయి. పూర్తి వివ‌రాలు మీకోసం.

PREV
15
ఇండియా vs ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్ లు ఫ్రీగా ఎక్కడ చూడాలి? పూర్తి షెడ్యూల్ ఇదిగో
india vs england odi series schedule and broadcasting details

ప్రస్తుతం  ఇంగ్లాండ్ జట్టు ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం భారత్ లో పర్యటిస్తోంది. ఇండియా-ఇంగ్లాండ్ మధ్య 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ముగిసింది. ఇండియా 4-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఇప్పుడు ఇండియా-ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ జరగనుంది. మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో, రెండో మ్యాచ్ ఫిబ్రవరి 9న కటక్‌లో, మూడో మ్యాచ్ లో ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరగనుంది. 

'మిని వరల్డ్ కప్' అని పిలువబడే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు జరుగుతున్నందున ఈ సిరీస్ రెండు జట్లకు కీలకం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జోష్ నింపుకోవడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. టీ20 జట్టుతో పోలిస్తే భారత వన్డే జట్టు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
 

25

వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ తో తలపడున్న భారత్ 

రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆడనుంది. భారత వన్డే జట్టులో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు జట్టులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ ఈ సిరీస్ ద్వారా వన్డే జట్టులోకి వస్తున్నాడు. అలాగే, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లకు ఈ సిరీస్ మంచి పునరాగమనం అవుతుంది. 

విమర్శకుల నోళ్లు మూయించడానికి స్టార్ సినీయర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మలకు ఈ సిరీస్ మంచి అవకాశం అని చెప్పాలి. బౌలింగ్‌లో మహ్మద్ షమీ తన ఫిట్‌నెస్‌ను పరీక్షించుకోవచ్చు. కుల్దీప్ యాదవ్ కూడా చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చాడు. 

ఆండ్రీ రస్సెల్: 17 గంటల్లో రెండు దేశాల్లో రెండు టీ20లు ఆడేశాడు !

35

భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ 2025 పూర్తి షెడ్యూల్ ఇదే 

భారత్ - ఇంగ్లాండ్  మధ్య వన్డే సిరీస్ లో మ్యాచ్ లు అన్ని మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం అవుతాయి. మొదటి వన్డే మ్యాచ్ నాగ్ పూర్ లోని విదర్బ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ లో కటక్ లోని బరాబతి స్టేడియంలో జరుగుతుంది. ఈ సిరీస్ లో చివరిదైన మూడో వన్డే మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. 

ఫిబ్రవరి 6 - మొదటి వన్డే, నాగ్‌పూర్ (మధ్యాహ్నం 1:30 నుండి)
9 ఫిబ్రవరి - రెండవ వ‌న్డే, కటక్ (మధ్యాహ్నం 1:30 నుండి)
12 ఫిబ్రవరి - మూడవ వ‌న్డే, అహ్మదాబాద్ (మధ్యాహ్నం 1:30 నుండి)

 

45
ఇండియా-ఇంగ్లాండ్

పరువు కాపాడుకోవాలని చూస్తున్న ఇంగ్లాండ్.. విమర్శలకు చెక్ పెట్టాలనుకుంటున్న రోహిత్, విరాట్ 

ఇంగ్లాండ్, భారత్ వన్డే సిరీస్ ఇరు జట్ల ప్లేయర్లకు చాలా కీలకం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు జరుగుతున్న వన్డే సిరీస్. అలాగే, టీ20 సిరీస్ ఓడిన ఇంగ్లాండ్ జట్టు వన్డే సిరీస్ ను నిలబెట్టుకుని పరువు కాపాడుకోవాలని  చూస్తోంది. ఇదే సమయంలో రాబోయే వన్డే సిరీస్ లో సత్తా చాటి తమపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని భారత సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టార్గెట్ గా పెట్టుకున్నారు.

దీని కోసం సూపర్ ఇన్నింగ్స్ లను  ఆడి భారత్ కు వన్డే సిరీస్ ను విజేతగా నిలబెట్టాలనుకుంటున్నారు. జో రూట్ ఇంగ్లాండ్ వన్డే జట్టులోకి రావడం జట్టుకు బలం చేకూరుస్తుంది. టీ20 సిరీస్ ఆడిన ఆటగాళ్లే వన్డే సిరీస్‌లో కూడా ఆడుతున్నారు. భారత టీమ్ లో టీ20 జట్టుతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉండనుంది.

55

భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ ఫ్రీగా ఎక్కడ చూడాలి? 

భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. టాస్ మధ్యాహ్నం 1 గంటకు వేస్తారు.  సిరీస్ మొత్తాన్ని స్టార్ స్పోర్ట్స్‌లో చూడవచ్చు. డిస్నీ+హాట్‌స్టార్‌లో కూడా లైవ్ చూడవచ్చు. DD Free Dish లోని DD Sports ఛానల్‌లో కూడా ప్రసారం అవుతుంది.

రెండు జట్ల ఆటగాళ్లు వీరే

ఇండియా జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హర్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా,హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లాండ్ జట్టు: బట్లర్ (కెప్టెన్), ఆర్చర్, అట్కిన్సన్, బెథెల్, బ్రూక్, కార్సే, డకెట్, ఓవర్టన్, స్మిత్, లివింగ్‌స్టోన్, రషీద్, రూట్, మహ్మద్, సాల్ట్, వుడ్.

IND vs PAK: ఇదెక్క‌డి క్రేజ్ సామి.. క్ష‌ణాల్లో టిక్కెట్ల‌న్ని అమ్ముడ‌య్యాయి !

Read more Photos on
click me!

Recommended Stories