Andre Russell,
Andre Russell: వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 9000 పరుగులు అందుకున్నాడు. టీ20 క్రికెట్ లో ఆండ్రీ రస్సెల్ ఇప్పటివరకు 536 మ్యాచ్‌లు ఆడి 26.79 సగటు, 169.15 స్ట్రయిక్‌రేట్‌తో 9004 పరుగులు చేశాడు. తన ఈ పరుగుల ఇన్నింగ్స్ లో 2 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇదే సమయంలో మరో రికార్డు కూడా సాధించాడు.
Andre Russell
24 గంటల్లోనే రెండు దేశాల్లో రెండు వేర్వేరు లీగ్ లలో ఆడిన ఆండ్రీ రస్సెల్
అత్యంత వేగంగా 9000 పరుగుల మార్కును అందుకున్న వెస్టిండీస్ స్టార్ ఆండ్రీ రస్సెల్ మరో అరుదైన రికార్డును కూడా సాధించాడు. అతను కేవలం 24 గంటలు కాకముందే రెండు దేశాల్లో.. రెండు వేర్వేరు లీగ్ లలో ఆడాడు.
ఫిబ్రవరి 2 న జరిగిన ILT20 ఎడిషన్‌లో అతను అబుదాబి నైట్ రైడర్స్ (ADKR) తరపున ఆడాడు. అందులో అతను గోల్డెన్ డక్‌గా నిలిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అతను కేవలం 15 గంటల తర్వాత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL 2024-25) లో రంగ్‌పూర్ రైడర్స్ (RAN) కు ప్రాతినిధ్యం వహించడానికి ఢాకా వెళ్లాడు.
Sanju Samsons: ఆ టీమిండియా స్టార్ కు 'ఇగో' ఎక్కువ
Andre Russell
రెస్ట్ లేని ప్రయాణం ఆండ్రీ రస్సెల్ ను దెబ్బకొట్టింది
వెస్టిండీస్ స్టార్ ఆండ్రీ రస్సెల్ క్రికెట్ మైదానంలో ముఖ్యంగా ఐపీఎల్‌లో తన ఆల్ రౌండ్ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందాడు. కానీ 37 ఏళ్ల అతను 24 గంటల్లో వేర్వేరు దేశాలలో రెండు T20 మ్యాచ్‌లు ఆడటం ద్వారా అద్భుతమైన క్రికెట్ ఆటతీరును ప్రదర్శించాడు.
రస్సెల్ దుబాయ్‌లో తన క్రికెట్ మారథాన్‌ను ఆదివారం రాత్రి 7.30 గంటలకు IST ప్రారంభించాడు. దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన ఇంటర్నేషనల్ లీగ్ T20 (ILT20) మ్యాచ్ తర్వాత అతను ఢాకాలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడాడు. రంగ్‌పూర్ రైడర్స్‌తో జరిగిన BPL ఎలిమినేటర్‌లో ఖుల్నా టైగర్స్ తరపున రస్సెల్ మైదానంలోకి దిగాడు. అయితే, రెస్ట్ లేకుండా ప్రయాణం చేయడం అతని ఆటతీరుపై ప్రభావం చూపింది. రెండు మ్యాచ్ లలోనూ రస్సెల్ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు.
రస్సెల్ పై భారీ అంచనాలు దెబ్బకొట్టాయి
ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడే ఆండ్రీ రస్సెల్ తనదైన ఆటతో అద్భుతాలు చాలానే చేశాడు. ఇప్పటికే అనేక రికార్డులు సాధించాడు. అలాంటి సూపర్ ఇన్నింగ్స్ లను అభిమానులు, ఆ ఫ్రాంఛైలు ఆశించాయి. కానీ, అది జరగలేదు.
రస్సెల్ ఆ రెండు మ్యాచ్‌లలోనూ మైదానంలో తన వీరోచిత ప్రదర్శనను చూపించలేకపోయాడు. ILT20 మ్యాచ్‌లో రస్సెల్ మొదటి బంతికే అవుట్ అయ్యాడు. డేవిడ్ వార్నర్ అజేయంగా 93 పరుగులు చేయడం DC ఇన్నింగ్స్‌లో హైలైట్ గా నిలిచింది. దీంతో రస్సెల్ నైట్ రైడర్స్ టీమ్ 26 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Image credit: PTI
ILT20 2025లో రస్సెల్ పవర్ కనిపించలేదు
బీపీఎల్‌లో రస్సెల్ ఆకట్టుకోలేకపోయాడు. రైడర్స్ 85 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందులో రస్సెల్ కేవలం నాలుగు పరుగులకే ఆలౌట్ అయ్యాడు. అలాగే, బౌలింగ్ లో కూడా మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఒకే ఓవర్ లో 14 పరుగులు ఇచ్చాడు. రస్సెల్ జట్టుపై టైగర్స్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.
ILT20 2025లో అబుదాబి నైట్ రైడర్స్ తరపున ఆండ్రీ రస్సెల్ ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అతను 10 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 18.57 సగటుతో కేవలం 130 పరుగులు మాత్రమే చేశాడు. కుడిచేతి వాటం పేసర్ మూడు ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ వేసి 11.42 దారుణమైన ఎకానమీ రేటుతో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆండ్రీ రస్సెల్ఐ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు.
గొంగడి త్రిష: టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టిన తెలుగమ్మాయి