Published : Oct 22, 2021, 06:07 PM ISTUpdated : Oct 22, 2021, 06:14 PM IST
ఐపీఎల్ 2021 సీజన్ రెండో ఫేజ్ ఆరంభానికి ముందు భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో రద్దయిన ఐదో టెస్టుపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఐదో టెస్టు రద్దు కావడంతో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న టీమిండియాకి సిరీస్ ఇవ్వడానికి ఇంగ్లాండ్ అంగీకరించలేదు... ఆ మ్యాచ్ ఫలితాన్ని ఇంగ్లాండ్ ఖాతాలో వేయడానికి ఐసీసీ, బీసీసీఐ ఒప్పుకోలేదు. దీంతో ఎట్టకేలకు ఐదో టెస్టు పెట్టడానకే ఫిక్స్ అయ్యాయి ఇరు జట్లు...
ఇప్పటికే భారత క్రికెట్ బోర్డుతో పాటు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా ఈ టెస్టు సిరీస్ ఇక్కడితో ముగిసిందని, వచ్చే ఏడాది జరిగే మ్యాచ్‌ను ఏకైక టెస్టుగా పరిగణిస్తామని ప్రకటించాయి.
211
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని కూడా టెస్టు సిరీస్‌లో భాగంగా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నాయి ఇరుదేశాల క్రికెట్ బోర్డులు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువరించింది.
311
‘భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టును 2022, జూలై 1న నిర్వహిస్తాం. ఈ ఏకైక టెస్టు ఫలితాన్ని బట్టి సిరీస్ విజేత నిర్ణయించబడుతుంది...’ అంటూ తెలిపింది ఈసీబీ...
411
మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో బిజీ షెడ్యూల్ కారణంగా ఎడ్బస్టన్ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు జరగనుంది. ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా మూడు టీ20 మ్యాచులతో పాటు ఓ టెస్టు మ్యాచ్ ఆడనుంది...
511
తొలి టీ20 జూలై 7న ఏంజెల్స్ బౌల్‌లో, 9న రెండో టీ20, 10న మూడో ట20 మ్యాచులు జరుగుతాయి. ఆ తర్వాత 12, 14, 17 తేదీల్లో వన్డే సిరీస్ జరగనుంది...
611
జూలై 1 నుంచి 5 వరకూ టెస్టు మ్యాచ్ ఆడే భారతజట్టు, ఆ తర్వాత ఒక్క రోజు గ్యాప్‌లో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ జట్టుకి టెస్టులకు, వన్డే, టీ20లకు వేర్వేరు జట్లు ఉండడంతో వారికి ఇది సమస్యేమీ కాదు...
711
అయితే భారత జట్టు విషయానికి వస్తే టెస్టుల్లో, టీ20ల్లో ఆడే ప్లేయర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విరాట్, రోహిత్, రాహుల్, బుమ్రా... ఇలా ప్రధాన ప్లేయర్లు మూడు ఫార్మాట్లోనూ కీలకంగా మారారు...
811
బిజీ షెడ్యూల్ కారణంగా టెస్టు మ్యాచ్ తర్వాత జరిగే టీ20 సిరీస్‌కి కీ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పృథ్వీషా, రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దత్ పడిక్కల్ వంటి ప్లేయర్లను ఆడిస్తారేమో చూడాలి...
911
మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఐదో టెస్టు ఆడడానికి భారత ఆటగాళ్లు అంగీకరించకపోవడంతో దాన్ని ‘ఫోర్‌ఫీట్’గా పరిగణించాలని ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ని కోరింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...
1011
అయితే కరోనా కారణంగా వరుసగా క్రికెట్ సిరీస్‌లు వాయిదా పడుతున్న తరుణంలో పాజిటివ్ కేసుల కారణంగా రద్దయిన మ్యాచ్‌ను ఇంగ్లాండ్ ఖాతాలో వేసేందుకు ఐసీసీ అంగీకరించలేదు...
1111
ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూలైలో ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత జట్టు... మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంది. అయితే ఐదో టెస్టు రద్దైన తర్వాత మరో టెస్టు లేదా రెండు టీ20 మ్యాచులు అదనంగా ఆడేందుకు బీసీసీఐ అంగీకరించింది.... టెస్టు సిరీస్ ఫలితం తేల్చేందుకు టెస్టు మ్యాచ్ ఆడడానికే అంగీకరించింది ఇంగ్లాండ్..