భారత్ vs ఆస్ట్రేలియా వన్డేలు ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?

Published : Oct 18, 2025, 06:24 PM IST

India vs Australia : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం (అక్టోబర్ 19) నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రీ ఎంట్రీతో సిరీస్ పై హైప్ కొనసాగుతోంది. అయితే, ఈ సిరీస్ మ్యాచ్ లను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు? ఆ వివరాలు మీకోసం.

PREV
15
భారత్ vs ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే క్రికెట్ సిరీస్ ఆదివారం (అక్టోబర్ 19) నుంచి ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ పోటీలు ఎప్పుడు కూడా ఫ్యాన్స్ కు ఫుల్ బిర్యానీలా ఉంటాయి. చాలా రోజుల తర్వాత సీనియన్ స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు భారత్ తరఫున గ్రౌండ్ లోకి దిగబోతున్నారు. దీంతో ఈ సిరీస్ పై మరింత ఆసక్తి నెలకొంది.

భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను అభిమానులు సోనీ లివ్ కాకుండా జియో హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. మొబైల్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీ లేదా ట్యాబ్లెట్‌లో ఈ మ్యాచ్‌లను లైవ్‌గా చూడవచ్చు. మొదటి మ్యాచ్ అక్టోబర్ 19న, రెండవది 23న, మూడవది అక్టోబర్ 25న జరగనుంది. మూడు మ్యాచ్‌లు కూడా ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. టాస్ ఉదయం 8:30 గంటలకు ఉంటుంది.

25
భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్

• మొదటి వన్డే: అక్టోబర్ 19, పెర్త్ స్టేడియం, పెర్త్

• రెండవ వన్డే: అక్టోబర్ 23, అడిలైడ్ ఓవల్ స్టేడియం, అడిలైడ్

• మూడవ వన్డే: అక్టోబర్ 25, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ

లైవ్ స్ట్రీమింగ్: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో హాట్‌స్టార్ యాప్/వెబ్‌సైట్

ఈ సిరీస్ కోసం జియో హాట్‌స్టార్ ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అభిమానులు తమకు సరిపోయే ప్లాన్‌ను ఎంచుకుని లైవ్ మ్యాచ్‌లు వీక్షించవచ్చు.

35
కోహ్లీ,రోహిత్ రీ ఎంట్రీతో సిరీస్‌కు మరింత హైప్

టీ20, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డేల్లో తిరిగి ఆడుతున్నారు. ఈ సిరీస్ ద్వారా ఇద్దరూ మళ్లీ భారత్ తరఫున ఆడబోతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

వీరిద్దరూ చివరిసారిగా మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నారు. ఈ మెగా టోర్నీలో భారత జట్టును విజేతగా నిలిపిన తర్వాత వీరు విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు వీరికి 2027 వన్డే వరల్డ్‌కప్‌కు ముందు తమ ఫామ్, ఫిట్నెస్‌ను పరీక్షించుకునే కీలక అవకాశంగా ఈ సిరీస్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

45
భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్

ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ ను వన్డే జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. ఇది భారత జట్టులో కొత్త తరం నాయకత్వానికి సంకేతంగా పరిగణిస్తున్నారు. కోహ్లీ, రోహిత్ అనుభవం యువ ఆటగాళ్లకు మార్గదర్శకంగా ఉండనుంది.

ఆస్ట్రేలియా పర్యటనలో గిల్‌కు ఇది పెద్ద సవాలుగా మారనుంది. గిల్ తొలి సిరీస్‌గా ఇది గుర్తింపు పొందుతుండగా, అనుభవజ్ఞుల సలహా అతనికి సహాయపడనుంది.

55
మ్యాచ్‌లపై అభిమానుల్లో ఉత్కంఠ

భారత్, ఆస్ట్రేలియా మధ్య పోటీ ఎప్పుడూ ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈసారి కోహ్లీ, రోహిత్ తిరిగి జట్టులో ఉండటం వల్ల టిక్కెట్లకు భారీ డిమాండ్ ఉంది. స్టేడియంలు నిండిపోవడం ఖాయం అని భావిస్తున్నారు.

ఆన్‌లైన్ వీక్షకుల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. జియో హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ లైవ్‌గా అందుబాటులో ఉండటం వల్ల అభిమానులు ఎక్కడ నుంచైనా సులభంగా వీక్షించగలరు.

మొత్తంగా ఆదివారం నుంచి ప్రారంభమయ్యే భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ క్రికెట్ అభిమానులకు పండుగలాంటిదని చెప్పవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories