టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా ఆఫ్ఘన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. 'ఈ మూడు మ్యాచ్ ల ద్వారా ఎంతో ప్రయోజనం పొందాల్సి ఉంది.. ప్రపంచ కప్ కు ముందు ఈ సీరిస్ కీలకం. ఎందుకంటే భారత్ కు టీ20 మ్యాచ్ లు ఆడే అవకాశం లేదు. ఐపీఎల్ ఉంది, కానీ ఇది అంతర్జాతీయ మ్యాచ్, మేము కొన్ని విషయాలను సాధించడానికి ప్రయత్నిస్తాము. ఈ కాంబినేషన్ ఎలా ముందుకు వెళ్తుందో, గ్రూప్ గా ఏం చేయాలో రాహుల్ భాయ్ తో మాట్లాడాను. మేం అదే చేయడానికి ప్రయత్నిస్తాం, గెలుపే ముఖ్యం' అని అన్నాడు.