Rohit Sharma
IND vs AFG 1st T20I: భారత్-ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ లో భాగంగా గురువారం తొలి మ్యాచ్ జరగనుంది. దీనికి మొహాలీ వేదిక కానుంది. అఫ్గానిస్థాన్ తో మూడు టీ20ల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించినప్పటి నుంచి దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైనే అంతటా ఆసక్తి నెలకొంది. గతంలో టీమిండియా టీ20 జట్టుకు నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వేర్వేరు గాయాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో రోహిత్ శర్మ జట్టును నడిపిస్తున్నాడు. ఇక ఐర్లాండ్ టీ20ల్లో భారత్ కు సారథ్యం వహించిన జస్ప్రీత్ బుమ్రాకు స్వదేశంలో ఇంగ్లండ్ తో జరగబోయే ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు ముందు విశ్రాంతినిచ్చారు.
Rohit Sharma
అయితే, భారత్-ఆఫ్ఘన్ సిరీస్ లో రోహిత్ శర్మ మరో అంతర్జాతీయ రికార్డును సృష్టించబోతున్నాడు. రోహిత్ రికార్డు విషయానికొస్తే అతని కెప్టెన్సీతో సంబంధం లేదుకానీ, పొట్టి ఫార్మాట్లో భారత్ సాధించిన 99 విజయాల్లో భాగస్వామ్యం వహించిన ఈ 36 ఏళ్ల స్టార్ ప్లేయర్ ఇప్పటికే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
రోహిత్ శర్మ తర్వాత, పాకిస్థాన్ తరఫున 86 విజయాల్లో భాగమైన షోయబ్ మాలిక్ రెండో స్థానంలో నిలిచాడు. జనవరి 11న (గురువారం) మొహాలీలో జరిగే తొలి టీ20లో అఫ్గానిస్థాన్ పై భారత్ విజయం సాధిస్తే అంతర్జాతీయ టీ20ల్లో ఒక జట్టుకు 100 విజయాలు అందించిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టిస్తాడు.
തലപ്പത്ത് ഹിറ്റ്മാന്
ఇప్పటివరకు 99 విజయాల్లో 3039 పరుగులు చేసిన అతను 37.98 సగటుతో, 142.60 స్ట్రైక్ రేట్ తో మూడు సెంచరీలు, 25 అర్ధసెంచరీలు భారత్ జట్టు గెలిచిన మ్యాచ్ లలో సాధించాడు. తన రికార్డును మరోసారి బద్దలు కొట్టనున్నాడు. రికార్డు స్థాయిలో 100వ సారి భారత విజయంలో పాలుపొంచుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
Rohit Sharma
అలాగే, టీ20ల్లో 4000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాళ్ల లిస్టులో చేరడానికి దగ్గరలో రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పటివరకు 140 ఇన్నింగ్స్ లలో 31.3 సగటుతో 3853 పరుగులు చేయగా, 139.2 స్ట్రైక్ రేట్ తో నాలుగు సెంచరీలు, 29 అర్ధసెంచరీల సాధించాడు. టీ20ల్లో 4 వేల పరుగులు చేసిన క్రికెటర్ క్లబ్ లో చేరాలంటే రోహిత్ శర్మ ఇంకా 147 పరుగులు చేయాల్సి ఉంది.