IND vs AFG: భార‌త్-ఆఫ్ఘనిస్థాన్ తొలి టీ20 జ‌రిగేనా..? ఆ విల‌న్ అడ్డురాక‌పోతే.. !

First Published | Jan 11, 2024, 4:06 PM IST

India Afghanistan T20 Series: భార‌త్-ఆఫ్ఘనిస్థాన్ తొలి టీ20కి వ‌ర్షం కాదుకానీ, తీవ్ర‌మైన‌ చ‌లి, పొగ‌మంచు నుంచి ముప్పు పొంచివుంది. మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో ఇండియా-ఆఫ్ఘ‌న్ ల మ‌ధ్య తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా, దాదాపు 14 నెల‌ల త‌ర్వాత రోహిత్ శ‌ర్మ టీ20 ఆడ‌బోతున్నాడు.
 

IND vs AFG, Mohali , Rohit Sharma

IND vs AFG 1st T20I: భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ టీ20 సిరీస్ కు అంతా సిద్ధ‌మైంది. గురువారం తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అయితే, మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ కు వ‌ర్షం  కాదు కానీ, ఇక్క‌డి శీతాకాల వాతావ‌ర‌ణం దెబ్బ‌కొట్టే అవ‌కాశాలు ఉన్నాయి. వ‌ర్ష ప్ర‌భావం పెద్ద‌గా లేక‌పోయినా మ‌రో అడ్డంకి కూడా ఉంది. అదే తీవ్ర‌మైన చ‌లి, పొగ‌మంచు. ప్ర‌స్తుతం మొహాలీ తీవ్రమైన చలిని ఎదుర్కొంటోంది. అలాగే, పొగ‌మంచు కూడా పెద్దఎత్తున ప్ర‌భావం చూపుతోంది.  తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా మంచు, పొగమంచు తీవ్ర ప్రభావం కనిపించింది.

తొలి టీ20 మ్యాచ్ రద్దవుతుందా?

జనవరి నెలలో చలి, మంచు, పొగమంచు ప్రభావం మొహాలీలో ఎక్కువగా కనిపిస్తుంది. గురువారం మొహాలీలో కనిష్ఠ ఉష్ణోగ్రత మ్యాచ్ రోజున 5-6 డిగ్రీలు త‌క్కువ‌గా నమోదయ్యే అవకాశం ఉంది. సూర్యాస్తమయం తరువాత భారీ మంచు ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి ఫ్లడ్ లైట్ల కింద మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మ్యాచ్ కు ఇక్క‌డి వాతావార‌ణం విల‌న్ అయ్యే అవ‌కాశం లేక‌పోలేదు. మ్యాచ్ సమయంలో పొగమంచు ఎక్కువ‌గా ఉంటే దృశ్యమానత దెబ్బ‌తింటుంది. దీని కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు అయ్యే అవ‌కాశం కూడా ఉంటుంది.


మంచుతో బౌలర్లకు ఇబ్బందులే... 

మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) స్టేడియం జనవరి శీతాకాలంలో డే నైట్ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. ఉత్తర భారతదేశం ప్రస్తుతం పొగమంచుతో చలిగాలుల తీవ్రంగా వీస్తున్నాయి. ఇది సాధారణ జనజీవనాన్ని ప్రభావితం చేసింది. మొహాలీ వేదికగా జరిగే తొలి టీ20లో భారత్, అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు చలిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మంచు కారణంగా బంతిని పట్టుకోవడం బౌలర్లకు కష్టమవుతుంది.
 

Mohali Stadium

క్యూరేటర్ ఏం చెబుతున్నారు..? 

పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) చీఫ్ క్యూరేటర్ రాకేశ్ కుమార్ మాట్లాడుతూ.. పీసీఏ శీతాకాలంలో హోమ్ మ్యాచ్ లను నిర్వహిస్తోందన్నారు. అదృష్టవశాత్తు గత రెండు మూడు రోజులుగా పొగమంచు తగ్గింది. మంచు విషయానికొస్తే, దానిని దూరంగా ఉంచడానికి గ్రౌడ్ లో కొన్ని ర‌సాయ‌నాలు ఉప‌యోగిస్తున్నామ‌నీ, గ‌తంలో ఇలాంటివి ఫ‌లితాన్ని ఇచ్చాయ‌ని చెప్పారు. 
 

Latest Videos

click me!