India vs South Africa: సౌతాఫ్రికా టూర్ కు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. టీంలో ఉన్న‌ది వీరే..

First Published | Dec 1, 2023, 10:04 AM IST

India tour of South Africa, 2023-24: దక్షిణాఫ్రికా సిరీస్ కోసం భార‌త టెస్ట్ జ‌ట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్ర‌క‌టించింది. టెస్ట్ సిరీస్ లో భ‌ర‌త జ‌ట్టుకు రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. 
 

India squad for South Africa tour: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ లో టీమిండియాకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. మరోవైపు వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించనున్నారు.

ఇటీవల స్వదేశంలో ముగిసిన ప్రపంచకప్ జట్టును ఫైనల్ కు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన రోహిత్ శర్మకు భారత పొట్టి ఫార్మాట్ నుంచి విరామం లభించింది. అయితే, అతను భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
 


ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరిస్ లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా తలపడుతోంది. తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన టీమిండియా మూడో టీ20లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

సౌతాఫ్రికా సిరీస్ భారత టెస్ట్ జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్), కెఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్) ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఎం సిరాజ్, ముఖేష్ కుమార్, షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్) ప్రసిద్ధ్ కృష్ణ

దక్షిణాఫ్రికా పర్యటనకు భారత వన్డే జట్టు:

రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకు సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్.
 

ద‌క్షిణాఫ్రికా మూడు టీ20లకు భారత జట్టు:

యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ. సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.
 

Latest Videos

click me!