IND vs AUS T20: బిగ్ ఫైట్ ఖాయం.. భార‌త్-ఆస్ట్రేలియా నాల్గో టీ20, ఇరు జ‌ట్ల‌లో భారీ మ‌ర్పులు

First Published Nov 30, 2023, 4:39 PM IST

India vs Australia:నాల్గో టీ20లో శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ తర్వాత తిలక్ వర్మను జట్టు నుంచి తప్పించే అవకాశముంది. గత మూడు మ్యాచుల్లో చెప్పొకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. దీంతో సూర్యకుమార్ యాదవ్ జ‌ట్టులో ఉండ‌క‌పోవ‌చ్చు. మరోవైపు ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో దీపక్ చాహర్ ను తీసుకోవ‌చ్చు.
 

India vs Australia T20I Series: ప్ర‌స్తుతం జ‌రుగుతున్న భార‌త్-ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో వ‌రుస‌గా రెండు మ్యాచ్ లు గెలిచిన భార‌త్.. మూడో టీ20లో ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా విజ‌యం సాధించింది. నాల్గో మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవ‌సం చేసుకోవాల‌ని భార‌త్ చూస్తుండ‌గా, ఈ మ్యాచ్ లో విజ‌యం సాధించి 2-2తో స‌మం చేయాల‌ని ఆస్ట్రేలియా చూస్తోంది.
 

ఈ క్ర‌మంలోనే ఇరు జ‌ట్లు భారీగా మార్పులకు సిద్ధ‌మ‌య్యాయి. ఆస్ట్రేలియాతో నాలుగో మ్యాచ్ కు ముందు టీమిండియాలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి నాలుగు, ఐదో మ్యాచ్ లకు స్టార్ బౌలర్ ముఖేష్ కుమార్ అందుబాటులో ఉండడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల ప్రకటించింది.
 

Latest Videos


ముఖేష్ కుమార్ స్థానంలో దీపక్ చాహర్ ను జట్టులోకి తీసుకునే అవ‌కాశ‌ముంది. రాయ్ పూర్ లో జరిగే ఈ మ్యాచ్ లో అతనికి ఆడే అవకాశం లభించ‌నుంది. దీంతో పాటు నాలుగో మ్యాచ్ లో మరో ప్లేయ‌ర్ జ‌ట్టులోకి రానున్నాడు. అత‌నే శ్రేయాస్ అయ్యర్. 
 

ఈ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించి నాలుగు, ఐదో మ్యాచ్ లకు శ్రేయాస్ అయ్యర్ జట్టుతో చేరుతాడని చెప్పింది. అతను బ్యాట‌ర్ గానే కాకుండా వైస్ కెప్టెన్ గా కూడా జ‌ట్టులో కొన‌సాగ‌నున్నాడు.
 

ಶ್ರೇಯಸ್ ಅಯ್ಯರ್: 1 ಕೋಟಿ ರುಪಾಯಿ

శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ తర్వాత యువ బ్యాట‌ర్ తిలక్ వర్మను జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది. గత మూడు మ్యాచుల్లో అతని ప్రదర్శన ప్రత్యేకంగా చెప్పుకునే విధంగా ఏమీ లేదు. దీంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అత‌న్ని ప‌క్క‌న పేట్టే అవ‌కాశ‌ముంది. మరోవైపు ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానాన్ని దీపక్ చాహర్ భర్తీ చేయ‌నున్నార‌ని స‌మాచారం. 

భార‌త్ జ‌ట్టు అంచ‌నా ప్ర‌కారం.. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ లు.
 

ఆస్ట్రేలియాలో కూడా కీల‌క మార్పులు చోటుచేసుకున్నాయి. ఆస్ట్రేలియా జ‌ట్టు అంచ‌నా ప్ర‌కారం..  మాథ్యూ వేడ్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, జోస్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్‌వెల్, నాథన్ ఎల్లిస్, సీన్ అబాట్, తన్వీర్ సంఘా, ఆడమ్ జంపా. 
 

click me!