చ‌రిత్ర సృష్టించిన జ‌స్ప్రీత్ బుమ్రా.. 38 ఏండ్ల త‌ర్వాత స‌రికొత్త రికార్డు !

First Published | Feb 5, 2024, 3:00 PM IST

India vs England: భార‌త్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 9 వికెట్లు తీసుకుని జ‌స్ప్రీత్ బుమ్రా భారత్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. అలాగే, పేస‌ర్ గా అత్యుత్త‌మ బౌలింగ్ గ‌ణాంకాలు న‌మోదుచేశాడు.
 

Jasprit Bumrah

India vs England - Jasprit Bumrah:  వైజాగ్ వేదిక‌గా జ‌రిగిన భార‌త్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన ఇంగ్లాండ్ పై 106 ప‌రుగుల తేడాతో గెలిచింది.

Jasprit Bumrah,Ollie Pope

విశాఖప‌ట్నం టెస్టులో టీమిండియా గెలుపులో భార‌త బౌల‌ర్లు కీల‌క పాత్ర పోషించాడు. ముఖ్యంగా భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను చెడుగుడు అడుకున్నాడు. త‌న స్వింగ్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ వికెట్ల‌ను ఎగిరిప‌డేలా చేశాడు. 

Latest Videos


భార‌త్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో జ‌స్ప్రీత్ బుమ్రా మొత్తంగా 9 వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు ప‌డ‌గొట్టిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్ లోనూ అద్భుత‌మై బౌలింగ్ తో 3 వికెట్లు తీసుకున్నాడు. 

వైజాగ్ టెస్టులో బుమ్రా త‌న కెరీర్ లో మ‌రో అత్యుత్త‌మ‌మైన టెస్టు గ‌ణాంకాల‌ను న‌మోదుచేశాడు. భార‌తీయ సీమ‌ర్ గా రెండో అత్యుత్త‌మ బౌలింగ్ గ‌ణాంకాల‌ను కూడా న‌మోదుచేయ‌డం విశేషం. 

1986లో ఎడ్జ్‌బాస్టన్‌లో చేతన్ శర్మ 10/188 తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ ల‌లో ఒక భారతీయ సీమర్‌కు రెండవ అత్యుత్తమ మ్యాచ్ గణాంకాలను బుమ్రా న‌మోదుచేశాడు. రెండో టెస్టులో ఇంగ్లాండ్ పై జస్ప్రీత్ బుమ్రా 91 ప‌రుగులు ఇచ్చి 9 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

Jasprit Bumrah

వైజాగ్ టెస్టులో 9/91 త‌న కెరీర్ లో రెండో అత్యుత్త‌మ టెస్టు బౌలింగ్ గ‌ణాంకాలు న‌మోదుచేశాడు. బుమ్రా 2018లో ఆసీస్ పై  9/86, వైజాగ్ లో ఇంగ్లాండ్ పై  9/91, నాటింగ్‌హామ్ లో 2024లో ఇంగ్లాండ్ పై 9/110 వికెట్లు తీసుకోవ‌డం బుమ్రా టెస్టు కెరీర్ లో టాప్-3 అత్యుత్త బౌలింగ్ గ‌ణాంకాలుగా ఉన్నాయి.

click me!