Team India: భార‌త జ‌ట్టు నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఔట్..

First Published | Dec 1, 2023, 10:41 AM IST

India tour of South Africa, 2023-24: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా జట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ కమిటీ ప్ర‌క‌టించింది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.
 

Rohit Sharma, Virat Kohli out: దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కోసం బీసీసీఐ టీ20 జట్టును ప్రకటించింది. అయితే, భార‌త స్టార్ బ్యాట‌ర్ల‌కు ఇందులో చోటు క‌ల్పించ‌లేదు. ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

సౌతాఫ్రికాతో జ‌రిగే టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ భార‌త‌ కెప్టెన్‌గా కొనసాగనుండగా, రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ప్ర‌స్తుతం సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌థ్యంలో భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ అడుతోంది. 
 


టీమిండియా స్టార్ బ్యాట‌ర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు భార‌త టీ20 జ‌ట్టులో చోటును కోల్పోయారు. అయితే, వీరిద్ద‌రినీ సౌతాఫ్రికాతో జ‌రిగే టెస్ట్ సిరీస్ కు సెల‌క్ష‌న్ క‌మిటీ ఎంపిక చేసింది. 
 

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతున్న జ‌ట్టునే సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో ఖరీదైన బౌలర్‌గా మారిన ప్రస్దిద్ద్ కృష్ణకు చోటు దక్కకపోవడంతో దీపక్ చాహర్‌కు జట్టులో చోటు దక్కింది. 
 

రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఎప్పటిలాగే జట్టులో ఓపెనర్లుగా తమ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. జితేష్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరు వికెట్ కీప‌ర్ల‌కు జ‌ట్టులో స్థానం క‌ల్పించారు. 
 

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వగా, హార్దిక్ పాండ్యా గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో సెల‌క్ష‌న్ క‌మిటీ హార్దిక్ పాండ్యాను సైతం ప‌క్క‌న పెట్టింది. 
 

దక్షిణాఫ్రికా పర్యటనకు భారత టీ20 జట్టు:

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్), జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్), ఆర్ జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ఎం సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్
 

Latest Videos

click me!