రోహిత్ శర్మ తన లగ్జరీ కారుకు ఎంచుకున్న నంబర్ 3015. ఈ యాదృచ్ఛికంగా ఎన్నుకున్నది కాదు. ఈ సంఖ్యకు మూడు ప్రత్యేక అర్థాలు ఉన్నాయి. ప్రస్తుత కారుకు ఎంపికైన 3015 నంబర్ రోహిత్ కుటుంబానికి సంబంధించి ప్రత్యేక తేదీలను సూచిస్తుంది.
మొదటి రెండు అంకెలు ‘30’ రోహిత్ కుమార్తె సమైరా శర్మ పుట్టిన డిసెంబర్ 30ని సూచిస్తాయి.
మిగతా రెండు అంకెలు ‘15’ ఆయన కుమారుడి నవంబర్ 15 పుట్టిన తేదీకి సంబంధించినవి.
30 + 15 = 45, ఇది రోహిత్ శర్మకు ప్రియమైన జెర్సీ నంబర్ కూడా కావడంతో, ఈ కారునెంబర్‌కు ఆయనకు ఓ ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పాలి.
గతంలో రోహిత్ వద్ద ఉన్న బ్లూ లంబోర్గిని కారు నంబర్ 0264. ఇది ఆయడు శ్రీలంకపై వన్డేలో చేసిన 264 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌కి సూచన. ఆ కారును రోహిత్ ఫాంటసీ యాప్ విజేతకు బహుమతిగా ఇచ్చాడు.