ఢిల్లీలో టీమిండియా ఐదు సూపర్ రికార్డులు

Published : Oct 14, 2025, 08:30 PM IST

India Creates 5 Big Records: విండీస్‌ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 2-0 తేడాతో గెలిచిన భారత్‌ ఐదు అద్భుత రికార్డులు సృష్టించింది. ఢిల్లీలో గిల్‌ సేన సాధించిన రికార్డులు ఏంటో తెలుసుకుందాం.

PREV
16
వెస్టిండీస్ ను చిత్తు చేసిన భారత్

భారత క్రికెట్ జట్టు విండీస్‌పై రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్‌ సేన మంగళవారం రోస్టన్ చేజ్‌ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టును ఏడువికెట్ల తేడాతో ఓడించింది. అంతకు ముందు అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌ను భారత్‌ ఇన్నింగ్స్‌, 140 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఈ విజయంతో గిల్‌ తన కెప్టెన్సీలో తొలి టెస్ట్ సిరీస్ విజయం సాధించాడు. పలు రికార్డులు నమోదు చేశాడు. 

26
10 వరుస సిరీస్ విజయాలతో భారత్ ప్రపంచ రికార్డు

భారత జట్టు టెస్ట్ చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై వరుసగా అత్యధిక సిరీస్ విజయాల ప్రపంచ రికార్డును సాధించింది. విండీస్‌పై భారత్‌ చివరిసారి 2002లో ఓటమి పాలైంది. అదే సంవత్సరం అక్టోబరులో ప్రతీకారం తీర్చుకున్న భారత్‌ అప్పటి నుంచి విండీస్‌పై వరుసగా 10వ సిరీస్‌ను గెలుచుకుంది.. ‎ ‎ఇదే రికార్డును దక్షిణాఫ్రికా కూడా విండీస్‌పై 1998–2024 మధ్య సాధించింది. ఒకప్పుడు అత్యంత శక్తివంతమైన జట్టుగా పేరుగాంచిన విండీస్‌పై భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది.

వరుస సిరీస్ విజయాల రికార్డులు

 ‎భారత్ vs విండీస్ – 10 (2002 నుంచి కొనసాగుతోంది) ‎ ‎

దక్షిణాఫ్రికా vs విండీస్ – 10 (1998–2024) ‎ ‎

ఆస్ట్రేలియా vs విండీస్ – 9 (2000–2022) ‎

 ‎ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ – 8 (1989–2003)

 ‎ ‎శ్రీలంక vs జింబాబ్వే – 8 (1996–2020)

36
భారత గడ్డపై విండీస్‌ వరుస ఓటములు

భారత గడ్డపై విండీస్‌ జట్టు వరుసగా ఆరు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. చివరిసారిగా 2011లో భారత్‌లో టెస్ట్ డ్రా చేసింది. అప్పటి నుంచి 2013 నుండి ఇప్పటివరకు ప్రతి టెస్ట్‌లో ఓటమి తప్పలేదు. డారెన్ సామీ కెప్టెన్సీ సమయం నుంచి ఇది కొనసాగుతోంది. ఇప్పుడు ఆయన వెస్టిండీస్ జట్టుకు కోచ్‌గా ఉన్నారు. ‎ ‎

భారత గడ్డపై వరుస ఓటముల రికార్డు: ‎

 ‎ఆస్ట్రేలియా – 7 (2008–2013)

 ‎ ‎శ్రీలంక – 6 (1986–1994) ‎ ‎

న్యూజిలాండ్ – 6 (2010–2016) ‎ ‎

విండీస్ – 6 (2013–ప్రస్తుతం)

46
‎ఒకే జట్టుపై వరుసగా అత్యధిక టెస్ట్ మ్యాచ్ విజయాలు

భారత్‌ విండీస్‌పై గత 27 టెస్ట్ మ్యాచ్‌లలో ఒక్కదానిలోనూ ఓటమి పాలుకాలేదు. ఇది ఒక జట్టుపై భారత్‌ సాధించిన నాలుగో అతిపెద్ద విజయాల రికార్డు. 2002 నుండి ఇప్పటి వరకు భారత్‌ విండీస్‌పై ఒక్క టెస్ట్‌లోనూ ఓడలేదు. ‎ ‎

ఒక ప్రత్యర్థిపై వరుస విజయాల రికార్డు ‎ ‎

ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ – 47 (1930–1975) ‎ ‎

ఇంగ్లాండ్ vs పాకిస్థాన్ – 30 (1961–1982) ‎ ‎

విండీస్ vs ఇంగ్లాండ్ – 29 (1976–1988) ‎ 

‎భారత్ vs విండీస్ – 27 (2002–2023) ‎ ‎

ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా – 24 (1911–1952) ‎

56
ఢిల్లీలో వరుసగా 14వ విజయం సాధించిన భారత్

1993 నుండి ఢిల్లీలో భారత్‌ ఒక్క టెస్ట్‌లోనూ ఓడలేదు. ఈ మ్యాచ్‌తో 14వ టెస్ట్‌ విజయాన్ని అందుకుంది. దీని ద్వారా ఢిల్లీ, మోహాలీ (13 మ్యాచ్‌లు) రికార్డును అధిగమించింది. గతంలో ముంబైలోని బ్రెబోర్న్ స్టేడియం (1948–1965), కాన్పూర్ (1959–1982) లలో వరుస విజయాల రికార్డు సృష్టించింది. ‎

66
విండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్‌కు చెత్త రికార్డు

వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ తన కెప్టెన్సీలో ఐదు వరుస టెస్ట్‌లను కోల్పోయిన రెండో కెప్టెన్‌గా చెత్త రికార్డు సాధించాడు. ఆయనకు ముందు క్రేగ్ బ్రాత్‌వైట్ ఇదే రికార్డు సృష్టించారు. చేజ్ నేతృత్వంలో విండీస్ ఈ ఏడాది ఆస్ట్రేలియాపై కూడా మూడు టెస్ట్‌ల్లో వరుసగా ఓడిపోయింది. ‎ ‎ఈ విజయాలతో భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ స్థాయిలో తన ఆధిపత్యాన్ని చాటింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీకి ఇది విజయవంతమైన ఆరంభం. ఢిల్లీలో సృష్టించిన ఈ ఐదు రికార్డులు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories