IND vs ZIM Preview : టీమిండియాలో కీలక మార్పులు.. ఈ ఓపెనర్‌పై వేటు పడుతుందా?

Published : Jul 25, 2026, 02:08 PM IST

జింబాబ్వేతో జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ప్లేయింగ్ XIలో మార్పులు చేసే అవకాశం ఉంది. గాయంతో బాధపడుతున్న స్టార్ ప్లేయర్‌కు విశ్రాంతి ఇచ్చి ఓ యువ ఆటగాడికి అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.

PREV
15
భారత జట్టులో భారీ మార్పులుంటాయా?

భారత్, జింబాబ్వే మధ్య టీ20 సిరీస్ రసవత్తరంగా మారింది. ఇప్పటికే ఓ మ్యాచ్ ను టీమిండియా సునాయాసంగా గెలిచింది… ఇవాళ (జులై 25, శనివారం) హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో రెండో టీ20 జరగనుంది. సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది, 4:00 గంటలకు టాస్ వేస్తారు.

ఈ మ్యాచ్ కోసం టీమిండియా తన ప్లేయింగ్ XIలో భారీ మార్పులు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓపెనింగ్ ఆర్డర్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమైనట్లు… ఓ స్టార్ ఓపెనర్‌ను పక్కన పెట్టాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

25
స్టార్ ఓపెనర్‌పై వేటు
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్ లేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే అతని బ్యాట్, గత కొన్ని మ్యాచ్‌లుగా సైలెంట్‌గా ఉంది. గత ఐదు మ్యాచ్‌లలో అతను కేవలం 73 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లోనూ అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు.
35
జింబాబ్వేపైనా నిరాశపర్చిన అభిషేక్

జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ నిరాశపరిచాడు. కేవలం 8 బంతులు ఎదుర్కొని 1 పరుగుకే ఔటయ్యాడు. అంతేకాదు మ్యాచ్ సమయంలో గాయపడటంతో ఏకంగా 15 ఓవర్ల పాటు మైదానానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అందుకే రాబోయే కీలక సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని, గాయం పెద్దది కాకుండా ఉండేందుకు రెండో టీ20లో అతనికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలని బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

45
యువ కెరటానికి గోల్డెన్ ఛాన్స్

అభిషేక్ శర్మ అందుబాటులో లేకపోవడంతో యువ ఆటగాళ్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు భారత జట్టు ప్లేయింగ్ XIలో చోటు దక్కడం దాదాపు ఖాయమైంది. తన దూకుడైన బ్యాటింగ్ శైలికి పేరుగాంచిన ప్రభ్‌సిమ్రాన్, వైభవ్ సూర్యవంశీతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.

55
సింహస్వప్నంలా కొత్త జోడీ

ఈ కొత్త, యువ ఓపెనింగ్ జోడీ హరారే మైదానంలో జింబాబ్వే బౌలర్లకు ఎలాంటి సవాల్ విసురుతుందో చూడాలి. జట్టులో ఈ కీలక మార్పు జరుగుతున్న నేపథ్యంలో ప్రభ్‌సిమ్రాన్, వైభవ్ జోడీ భారత్‌కు ఎలాంటి శుభారంభాన్ని అందిస్తుందో చూడాలని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

మ్యాచ్ వివరాలు…

ఇండియా vs జింబాబ్వే (రెండో T20) 

తేదీ: జులై 25, 2026 

గ్రౌండ్ : హరారే స్పోర్ట్స్ క్లబ్ 

టాస్ సమయం : సాయంత్రం 04:00 

మ్యాచ్ ప్రారంభం : సాయంత్రం 04:30

Read more Photos on
click me!

Recommended Stories