India vs Zimbabwe T20I: జింబాబ్వేపై టీమిండియాకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అభిషేక్ శర్మ, గిల్, జైస్వాల్ సహా పలువురు యంగ్ ప్లేయర్లు రికార్డుల మోత మోగించారు. అయితే, టీ20ల్లో జింబాబ్వే పై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత బ్యాటర్లు ఎవరో తెలుసా?
టీమిండియా యంగ్ బ్రిగేడ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లలో మన భారత యంగ్ బ్యాటర్లు తమ బ్యాట్‌కు పనిచెప్పి భారీగా పరుగులు సాధించారు. ఆ వికెట్లపై ఆధిపత్యం చెలాయిస్తూ జట్టుకు అద్భుతమైన విజయాలను అందించారు. మరి టీ20 ఫార్మాట్‌లో జింబాబ్వే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత బ్యాటర్లు ఎవరో తెలుసా?
27
1. టాప్ లో అభిషేక్ శర్మ
జింబాబ్వేపై టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అందరికంటే ముందంజలో ఉన్నాడు. అభిషేక్ శర్మ జింబాబ్వేపై ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి, 35.80 సగటుతో ఏకంగా 179 పరుగులు సాధించాడు. మెరుపు ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఈ లిస్ట్‌లో నంబర్ వన్ పొజిషన్‌ను సొంతం చేసుకున్నాడు.
37
2. రెండో స్థానంలో శుభ్‌మన్ గిల్
టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. గిల్ జింబాబ్వేపై ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడి 170 పరుగులు చేశాడు. తన క్లాస్ షాట్లతో అలరించిన గిల్, ఈ క్రమంలో రెండు హాఫ్ సెంచరీలు కూడా బాదాడు. మైదానంలో నిలకడగా ఆడుతూ జట్టుకు కొండంత అండగా నిలవడంలో శుభ్‌మన్ గిల్ సక్సెస్ అయ్యాడు.
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చాలా తక్కువ మ్యాచ్‌లలోనే అద్భుత రికార్డు నమోదు చేసి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. జైస్వాల్ జింబాబ్వేపై కేవలం మూడు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడి, ఏకంగా 141 పరుగులు రాబట్టాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. క్రీజులోకి వచ్చిన ప్రతిసారీ వేగంగా పరుగులు సాధిస్తూ జట్టుకు మంచి ఆరంభాలు అందించాడు.
57
4. నాలుగో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్
క్లాస్ బ్యాటింగ్‌కు మారుపేరైన రుతురాజ్ గైక్వాడ్ ఈ లిస్ట్‌లో నాలుగో స్థానంలో ఉన్నాడు. రుతురాజ్ జింబాబ్వేపై మూడు ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 66.50 సగటు, 158.33 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 133 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. బాధ్యతాయుతంగా ఆడుతూనే అవసరమైనప్పుడు బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
67
5. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్
టీమిండియా స్టార్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో నిలిచాడు. కేఎల్ రాహుల్ జింబాబ్వేపై నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడి 120 పరుగులు సాధించాడు. రాహుల్ ఖాతాలో కూడా జింబాబ్వేపై ఒక హాఫ్ సెంచరీ ఉంది. కీలకమైన సమయంలో ఇన్నింగ్స్‌ను నిలబెట్టి జట్టును విజయం దిశగా నడిపించడంలో కేఎల్ రాహుల్ తన మార్కు చూపించాడు.
77
వన్డే క్రికెట్ లో టాప్ లో సచిన్ టెండూల్కర్
వన్డే క్రికెట్‌లో జింబాబ్వే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లో సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నారు. టెండూల్కర్ జింబాబ్వేపై వన్డేల్లో 1,377 పరుగులతో ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానంలో ఉన్నారు. జింబాబ్వేపై సచిన్ 5 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలోని టాప్-4 ఆటగాళ్లలో ముగ్గురు భారతీయ బ్యాటర్లు ఉన్నారు. సచిన్, అజహరుద్దీన్, ద్రవిడ్ టాప్ 3 లో ఉన్నారు.
టెస్టుల్లో జింబాబ్వేపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రాహుల్ ద్రవిడ్ 100కి పైగా సగటుతో టాప్‌లో ఉన్నారు. సచిన్ టెండూల్కర్ జింబాబ్వేపై అత్యధికంగా 5 సెంచరీలు సాధించారు, ఇందులో ఒక డబుల్ సెంచరీ (201*) కూడా ఉంది. వన్డేల తరహాలోనే టెస్టుల్లో కూడా సచిన్, ద్రవిడ్‌లు జింబాబ్వేపై తిరుగులేని రికార్డు నమోదు చేశారు.