టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. గతేడాది వన్డేలలో అరంగ్రేటం చేసిన యాదవ్.. ఈ ఫార్మాట్ లో మరే బ్యాటర్ సాధించని ఘనతను అందుకున్నాడు.
27
వన్డే క్రికెట్ చరిత్రలో తొలి ఆరు మ్యాచులలో 30 కి పైగా పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. బుధవారం విండీస్ తో జరిగిన రెండో వన్డేలో 83 బంతుల్లో 64 పరుగులు చేశాడు యాదవ్..
37
దీంతో గతంలో తొలి ఐదు వన్డేలలో 30 కి పైగా పరుగులు చేసిన నెదర్లాండ్స్ ఆటగాడు టెన్ డస్కటే, టామ్ కూపర్ లతో పాటు పాకిస్థాన్ ఆటగాడు ఫఖర్ జమాన్ ల రికార్డును బద్దలు కొట్టాడు.
47
సూర్యకుమార్ యాదవ్ తాజాగా వీరిని అధిగమించాడు. తన వన్డే కెరీర్ లో యాదవ్.. ఇప్పటివరకు ఆరు మ్యాచులే ఆడాడు. ఇందులో 65.25 సగటుతో 261 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
57
గత ఆరు మ్యాచులలో సూర్యకుమార్ యాదవ్ స్కోర్లు వరుసగా.. 64, 34నాటౌట్, 39, 40, 53, 31 నాటౌట్ గా ఉన్నాయి. ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో మరే ఇతర క్రికెటర్ కూడా ఇంత నిలకడగా రాణించింది లేదు.
67
మిడిలార్డర్ లో గతంలో రైనా స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్న ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అనడంలో సందేహమే లేదని భారత క్రికెట్ పండితులు కూడా విశ్లేషిస్తున్నారు. రైనా మాదిరే పరిస్థితులకు తగ్గట్టు ఆడటంలో యాదవ్ దిట్ట.
77
మ్యాచులను ఫినిష్ చేయడంలో యాదవ్ ను ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మైకెల్ బెవాన్ గా కూడా పోలుస్తున్నారు కొంతమంది. అయితే దీనిపై యాదవ్ స్పందిస్తూ.. ఆయన లెజెండ్ అని, తాను ఇప్పుడిప్పుడే భారత్ తరఫున ఆడుతున్నానని చెప్పుకొచ్చాడు.