టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కీలక నిర్ణయం తీసుకున్నాడు. బెంగాల్ కు చెందిన సాహా.. త్వరలో ప్రారంభం కాబోయే రంజీ సీజన్ నుంచి తప్పుకున్నాడు.
28
వ్యక్తిగత కారణాలతో రంజీల నుంచి తప్పకుంటున్నట్టు ప్రకటించినా దాని వెనుకాల వేరే కారణాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది. భారత జట్టు నుంచి మెల్లగా కనుమరుగవుతున్న అతడు.. ఆ బాధతోనే రంజీల నుంచి కూడా తప్పుకున్నట్టు సమాచారం.
38
మొహాలి వేదికగా వచ్చే నెల నుంచి భారత జట్టు.. శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు గాను టీమిండియాలో అతడిని ఎంపిక చేయడం కష్టమేనని అతడికి బోర్డు వర్గాల నుంచి తెలిసింది. దీంతో అతడు భారత జట్టులో చోటు దక్కనప్పుడు రంజీలు ఆడి ఏం ఉపయోగమని భావించి ఉంటాడని సాహాకు దగ్గరి వ్యక్తులు మీడియాతో చెప్పినట్టు తెలుస్తున్నది.
48
న్యూజిలాండ్ తో ముగిసిన టెస్టు సిరీస్ లో సాహా ఆడాడు. అయితే అప్పుడు రిషభ్ పంత్ కు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. సాహాకు అవకాశమిచ్చారు. కానీ దక్షిణాఫ్రికా పర్యటనకు తిరిగి పంత్ కే వికెట్ కీపింగ్ బాధ్యతలను అప్పజెప్పింది బీసీసీఐ.
58
పంత్ కు సబ్ స్టిట్యూట్ గా కోన భరత్ ను తీర్చిదిద్దాలనే భావనలో బీసీసీఐ ఉంది. తద్వారా అతడు కూడా మెరుగవుతాడు. మరోవైపు సాహా కూడా వయసు మీద పడుతుండటంతో గతంలో మాదిరిగా బ్యాటింగ్ లో రాణించడం లేదు.
68
ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కు ఎంపిక చేయబోమని జట్టు యాజమాన్యంలోని కీలక వ్యక్తులు సాహాకు నేరుగా చెప్పారు. పంత్ కు ప్రత్యామ్నయంగా భరత్ కు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.
78
అతడిని ఇప్పట్నుంచే జట్టులో చేర్చితే పరిస్థితులకు అలవాటు పడతాడు. అందుకే సాహాను పక్కనపెట్టారు. దీంతో అతడు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు ఈ రంజీ సీజన్ లో ఆడబోనని చెప్పి ఉంటాడు..’ అని తెలిపాడు.
88
భారత్ తరఫున 40 టెస్టులు ఆడిన సాహా.. 1,353 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు కూడా ఉన్నాయి. వికెట్ కీపర్ గా 104 మందిని పెవిలియన్ కు పంపాడు. ఇందులో 92 క్యాచులు, 12 స్టంప్ అవుట్ లు ఉన్నాయి.